వామ్మో .. అప్పుడే కొత్త కోడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ బాధ్యతలను అందుకునేసిందా..? అంటే యస్..అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్ గానే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల పెళ్లి జరిగింది. ఇటలీలో నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి .
అయితే రీసెంట్ గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ని రొమాంటిక్ పిక్చర్స్ లో నటించొద్దు అంటూ క్రేజీ కండిషన్స్ పెట్టిందట. అంతేకాదు మరీ ముఖ్యంగా హీరోయిన్ తో లిప్ లాక్ సీన్స్ లాంటివి చేస్తే అసలు ఊరుకోను అంటూ తెగేసి చెప్పేస్తుందట . కంటెంట్ ఉన్న సినిమాలు చూస్ చేసుకుని ప్లాప్ అయినా పర్లేదు..
హద్దులు మీరుపోయిన సీన్స్ చేస్తే అసలుకి ఒప్పుకోను అంటూ ముందుగానే కండిషన్స్ పెట్టిందట. దీంతో సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది. గతంలో ఉపాసన కూడా చరణ్ కి ఇలాంటి కండీషన్స్ నే పెట్టింది. ఇప్పుడు లావణ్య కూడా దే కండీషన్స్ పెట్టింది.. దీంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!