Newsవెండితెరే కాదు బుల్లితెర‌పై కూడా బాల‌య్య జోరు ముందు చిరు బేజారే...!

వెండితెరే కాదు బుల్లితెర‌పై కూడా బాల‌య్య జోరు ముందు చిరు బేజారే…!

వాల్తేరు వీరయ్య చిరంజీవికి రీఎంట్రీ తర్వాత మళ్లీ ప్రాణం పోసిన సినిమా. సైరా తర్వాత ఆ పాదఘట్టం ఆచార్య డిజాస్టర్లు. వాల్తేరు వీర‌య్య‌ తర్వాత భోళాశంకర్ అనబడే మరో ఎపిక్ డిజాస్టర్. అంతకు ముందు గాడ్ ఫాదర్ అని మరో డిజాస్టర్.. ఇలా నాలుగు ఐదు డిజాస్టర్ల మధ్యలో చిరంజీవికి ఆశా కిరణం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా వెండితెరపై సూపర్ హిట్ సినిమా. కథనాలు కొత్తవి కాదు ఆయిన సంక్రాంతి మానియాలో కొట్టుకుపోయింది. బాక్సాఫీస్ దగ్గర గట్టెకేసింది.

శృతిహాసన్ హీరోయిన్ కావటం.. అటు రవితేజ కూడా ఉండటం.. ఇవన్నీ కలిసి వీరయ్యను బాక్సాఫీస్ దగ్గర హిట్ చేశాయి. పైగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఏకంగా 200 రోజులు కూడా ఆడింది. నిజానికి చిరంజీవిని నీ రేంజ్‌కు తగినట్టుగా జనం ఎప్పుడూ గుర్తుంచుకునే ఓ మంచి సినిమా తీయమని అభిమానులు కోరుతున్నారు. అయినా చిరంజీవి మాత్రం అవే ఫైట్లు.. అవే డ్యాన్సులు.. అవే క్యారెక్టర్లు, అదే లుంగీకట్టుడు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

సరే ఈ సినిమా వెండితెర మీద ఎంత పెద్ద హిట్ అయిన బుల్లితెరపై అస్సలు ఈ సినిమాను పట్టించుకోలేదు. తాజాగా టీవీలో ప్రసారం చేస్తే ఈ సినిమాకు హైదరాబాద్ బార్క్ సర్కిల్స్ ప్రకారం కేవలం 4.42 టీఆర్పి రేటింగ్ వచ్చింది. చిరంజీవి రేంజ్ కు ఇది నిజంగా అవమానమే. ఇదే వాల్తేరు వీర‌య్య‌ పోటీగా సంక్రాంతికి వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమా వెండితెరపై సూపర్ హిట్. దీనిని బుల్లితెరపై ప్రసారం చేస్తే 8 నుంచి 9 మధ్యలో టిఆర్పి రేటింగ్ వచ్చింది.

అంటే బాలయ్య సినిమాకు వచ్చిన రేటింగ్ తో పోలిస్తే సగం మాత్రమే చిరంజీవి సినిమాకు వచ్చింది. చిరంజీవి, రవితేజ లాంటి సూపర్ హీరోయిక్‌ క్యారెక్టర్లతో సినిమా తీసిన కూడా టీవీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఏదేమైనా వెండితెరపై బాలయ్య జోరు ముందు చిరంజీవి రేసులో ఎలా వెనకబడ్డారో ?ఇటు బుల్లితెర మీద కూడా అదే పరిస్థితి క్లియర్‌గా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news