మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గ్యాంగ్ లీడర్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటిది ఈ సినిమా కథ ముందు చిరంజీవి కోసం అనుకున్నది కాదు. అలాగే, చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ఆఖరి బ్లాక్ బస్టర్ సినిమా. అంతేకాదు, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి, చిరంజీవి కాంబినేషన్‌లో బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంవత్సరం 1991.
ఇదే సంవత్సరం బప్పీ లహరి, చిరంజీవి కాంబినేషన్‌లో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు సినిమాలు వచ్చి మ్యూజికల్ గా, బాక్సాఫీస్ వద్ద లెక్కల పరంగా భారీ హిట్స్ అందుకున్నాయి. అయితే, గ్యాంగ్ లీడర్ కథ ముందు చిరంజీవి కోసం రాయలేదట. ఓ కథ అనుకొని దాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబుకి చెప్పారట పరుచూరి సోదరులు.
కానీ, ఈ కథ నాగబాబు కంటే కూడా చిరంజీవి చేస్తే పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకొని కథలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ చిరంజీవికి చెప్పారట. మంచి ఫాంలో ఉన్న చిరు గ్యాంగ్ లీడర్ కథ విని ఎంతో ఎగ్జైట్ అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. చిరు ఓకే అనుకున్న తర్వాత మిగతా టెక్నీషియన్స్, నటీనటుల ఎంపిక జరిగిందట. అప్పట్లో గ్యాంగ్ లీడర్ కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఒకవేళ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని చిరంజీవి కాకుండా నాగబాబుతో చేసి ఉంటే ఒక్కసారి ఊహించుకోండి.. బాక్సాఫీస్ వద్ద లెక్కలన్నీ ఎలా తారుమారయ్యేవో. పెద్ద డిజాస్టరే అయ్యుండేది. ఇలా చాలా సినిమాలు హీరోలు మారడం వల్ల సంచలన విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, బావగారూ బావున్నారా ఉంటాయి.