ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటుంది సీతారామం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్ బెంగాలీ అమ్మాయి. ఆమె చదువుకునే టైంలో డాక్టర్ కావాలని కలలు కనేది. డెంటిస్ట్ అయ్యే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆరోగ్యంగా తన కెరీర్ మార్చుకుంది. అదే టైంలో ఓ సినిమాకు అడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళింది. అలా మొదటి అడిషన్కే ఓ మరాఠీ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఆ తర్వాత ఇటు సినీవారంలోనూ, అటు మోడలింగ్లోను దూసుకుపోయింది.
తాజాగా ఈ బెంగాలీ బ్యూటీ నాని సరసన హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఇక తెలుగులో సీతారామం సినిమాతో ఆమెకు తిరిగిలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆమెను సౌత్ ఇండియా వైడ్‌గా సూపర్ పాపులర్ చేసేసింది. ఇటు సంప్రదాయంగాను, అటు హాట్ హాట్ లుక్‌లను దర్శనమిస్తూ ఉంటుంది మృణాల్. ఆమెకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లో ఉన్నారు. నెటిజన్లు అయితే ఆమెకు రకరకాల పిచ్చి ప్రశ్నలు వేసిన ఆమె చాలా ఓపికగా సమాధానాలు చెబుతూ ఉంటుంది.
ఓ యువకుడు మీ వయసు ఎంత ? అని ప్రశ్నిస్తే గత నెలలోనే తనకు 16 ఏళ్లు నిండయని ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇదే సందర్భంలో ఆమె అసలు వయసు కూడా బయటపెట్టింది. ఆమె వయసు 31 ఏళ్లు. మృణాల్ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. స్టిల్ బ్యాచిలర్. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటానన్న విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది.
మామూలుగా మృణాల్ ఠాకూర్‌ను చూస్తే ఆమెకు 31 ఏళ్లు వయసు ఉందని ఎవరు ? అనుకోరు. జస్ట్ 22 – 25 ఉంటుందేమో అనుకుంటారు. 30 ఏళ్లు అంటే ముదురుముద్దుగుమ్మే. అయితే కెరీర్ ఆలస్యంగా ప్రారంభించడంతో ఆమె వయసు ఎక్కువ అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇక తన ఆస్తి గురించి చెబుతూ తన నెట్‌వర్త్ వెలకట్టలేదని చెప్పుకొచ్చింది. తెలుగులో మృణాల్ ఇప్పుడు చిరంజీవి, బాలయ్య లాంటి ముదురు హీరోలకు కూడా మంచి ఆప్షన్ హీరోయిన్గా ఉంది.