Newsమెగాస్టార్ ప‌క్క‌న అలాంటి సినిమా చేసి కెరీర్ నాశ‌నం చేసుకున్న ఆ...

మెగాస్టార్ ప‌క్క‌న అలాంటి సినిమా చేసి కెరీర్ నాశ‌నం చేసుకున్న ఆ క్రేజీ హీరోయిన్..!

మీనాక్షి శేషాద్రి..ఈ పేరు వింటే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా ఫ్లాపైనా ఆపద్బాంధవుడు గురించి మాత్రం అప్పట్లో తెలుగు మేకర్స్, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్నారు. 1981లో మీనాక్షి శేషాద్రి మిస్ ఇండియా గెలుపొందింది. అప్పుడు తన వయసు 18 ఏళ్ళు. 1982లో పెయింటర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

1983లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సుభాష్ ఘయ్ నిర్మించిన హీరో సినిమాతో బాగా పాపులర్ అయింది. ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఆపద్బాంధవుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో క్లాసికల్ డాన్స్ కోసం హీరోయిన్‌గా మీనాక్షిని తీసుకున్నారు. ఏడిద నాగేశ్వరరావు సంస్థలో భానుప్రియ, జయప్రద లాంటి వారు నటించారు.

అందుకే, కొత్తగా ఉంటుందని మీనాక్షి శేషాద్రి ని తీసుకున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా వంకపెట్టడానికి లేదు. కానీ, కథ, కథనం బలహీనంగా ఉండటంతో మీనాక్షి శేషాద్రి మొదటి సినిమాతోనే ఫ్లాప్ చూసింది. చెప్పాలంటే ఆపద్బాంధవుడు పెద్ద డిజాస్టర్ మూవీ. ఇది క్లాసికల్ సినిమా. చిరంజీవి కెరీర్ లో మంచి సినిమాలుగా చెప్పుకునే రుద్రవీణ, ఆపద్బాంధవుడు పెద్ద డిజాస్టర్స్.

దాంతో చిరు ఇమేజ్ గానీ, దర్శకుడు కె విశ్వనాథ్ ప్రభావం గానీ మీనాక్షి శేషాద్రి మీద అసలు చూపలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికే మంచి కమర్షియల్ హీరోయిన్‌గా ఫాంలో ఉంది. కానీ, తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమా మళ్ళీ కనిపించలేదు. చిరంజీవి సరసన కాకుండా మిగతా హీరోల సరసన మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గనక చేసి హిట్ అయి ఉంటే ఈ బ్యూటీ కొంతకాలం టాలీవుడ్ లో వెలిగేదని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news