MoviesTL రివ్యూ: కీడా కోలా… అంద‌రికి కాదు వాళ్ల‌కు మాత్రం ఓకే

TL రివ్యూ: కీడా కోలా… అంద‌రికి కాదు వాళ్ల‌కు మాత్రం ఓకే

నటీనటులు: బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌, విష్ణు, హరికాంత్ తదితరులు
ఎడిటింగ్‌: ఉపేంద్ర వర్మ
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్‌
మ్యూజిక్‌: వివేక్ సాగర్
నిర్మాతలు: కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్
దర్శక‌త్వం : తరుణ్ భాస్కర్
రిలీజ్ డేట్‌: న‌వంబ‌ర్ 3, 2023

దర్శకుడు తరుణ్ భాస్కర్.. చేసిన రెండు సినిమాలతోనే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. ఐదేళ్లపాటు లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టాడు. పైగా టైటిల్ కీడా కోలా. అక్కడే సినిమాపై ఆసక్తి స్టార్ట్ అయింది. పెద్ద స్టార్ ఎట్రాక్షన్ లేక‌పోయినా ఈ సినిమా చుట్టూ బజ్‌ ఏర్పడింది అంటే అది తరుణ్ భాస్కర్ ప్రచార చిత్రాలు అని చెప్పక్కర్లేదు. క్రైమ్ కామెడీ జోనర్లో తయారైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా.. తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన విలక్షణ చాటుకున్నాడా ? కీడా కోలాతో హ్యాట్రిక్ విజయం దక్కించుకున్నాడా. అన్నది సమీక్షలో చూద్దాం.

క‌థ‌:
వరదరాజు (బ్రహ్మానందం) తన మనవడు వాసు చైతన్యరావుతో కలిసి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. వాసు వ్యక్తిగత సమస్యల కారణంగా అతడు జీవితం అగమ్య గోచరంగా తయారవుతుంది. ఈ లోపు వాసు స్నేహితుడు (కౌశిక్) మయూర్ రాగ్‌ ఇచ్చిన కీడా కోలా బాటిల్ ఐడియాతో కోట్లలో డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. ఇంతకీ ఆ ఐడియా ఏమిటి..? దాని కోసం వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు ? మరోవైపు నాయుడు (తరుణ్ భాస్కర్) 20 ఏళ్లు జైలులో గడిపి తిరిగి వస్తాడు. తన తమ్ముడు జీవన్‌ కోసం ఓ ప్లాన్ వేస్తాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటి..? ఈ ప్లాన్ కి వాసు, కౌశిక్ ఐడియా కి ఉన్న సంబంధం ఏమిటి..? చివరికి ఈ కథలో ఎలాంటి మలుపులు తిరిగి కథ ఎలా ? ముగిసింది అన్నదే సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
క్రైమ్ కామెడీ అనేది ఇంట్రెస్టింగ్ జోనర్. కీడా కోలా సినిమాని అంతే గమ్మత్తుగా తీయటానికి ట్రై చేసాడు తరుణ్ భాస్కర్. ఈ నగరానికి ఏమైంది సినిమాలోలా ఈ సినిమా కథ కూడా యాక్సిడెంట్ సీన్‌తో మొదలుపెడతాడు. పాత్రలన్నీ స్లో మోషన్ తో పరిచయాలు ఇస్తూ కథలోకి తీసుకువెళతాయి. కీడా కోలా అనే కూల్డ్రింక్ బాటిల్ చుట్టూ ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సరదాగా సాగుతుంది. సినిమాలో కామెడీ, సెకండాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ సీన్స్‌ అలరిస్తాయి. సినిమాలో నాయుడు పాత్ర‌.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. ఆ పాత్రతో ఉన్న మిగిలిన ప్రధాన పాత్రలు.. కీడాకోలా బాటిల్ తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఎలిమెంట్స్.. సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ యాక్షన్ సన్నీ వేశాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి.

హీరో చైతన్య రావు చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే ఒక వీక్ పెర్సన్ గా బాగా నటించాడు. యాక్షన్స్ స‌న్నివేశాల్లో ఇరుక్కునే సీన్లలో సెటిల్ పెర్ఫార్మన్స్ తో సినిమాకు ప్రాణం పోశాడు తరుణ్ భాస్కర్. రాగ్ మయుర్, జీవన్ తమ కామెడీతో ఈ సినిమాకి ప్రాణం పోశారు. వారి డైలాగ్ ఫిక్ష‌న్‌ కూడా సినిమాకు బాగా ప్లస్. బ్రహ్మానందం మంచి పాత్రలో కనిపించాడు. మిగిలిన పాత్రధారులు కూడా తమ వరకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ తన టేకింగ్‌తో సినిమా మొత్తాన్ని భుజాలపై మోసాడు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సినిమాలో కొన్ని ఎత్తు, పల్లాలు ఉన్నాయి. చాలా చిన్న కథ. ఇది ఈ చిన్న కథ కూడా ముందు సాగుతున్నట్టుగా ఏమీ అనిపించదు. కానీ ఒక పాయింట్ కే పరిమితం చేసి పాత్రల చుట్టూ హ్యూమర్ పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది.

అలాగే ఇందులో చాలా పాత్రలు ఏదో ఒక వైకల్యం ఉన్నట్టు కనిపిస్తాయి. ఆ వైకల్యం ఉన్న పాత్రల చుట్టూ కామెడీ రాసి హుందాగా కథ నడిపించడం సవాల్ లాంటిది. అయితే తరుణ్ భాస్కర్ ఆ పాత్రలని చాలా బ్యాలెన్స్‌గా రాసుకొని వాటి చుట్టూ కామెడీ రాసి హుందాగా పండించే విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. క్రైమ్ సన్నివేశాలు చాలా బాగున్నా కథనం పూర్తి ఆసక్తికరంగా సాగదు.. సినిమా కొన్నిచోట్ల బోర్ కొట్టినట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగటం సినిమాకి మైనస్.. సినిమాలో కొన్ని సన్నివేశాలు నాటకీయత ఎక్కువగా ఉండటం. కథలో కొన్నిచోట్ల నేచురాలిటీ లోపించినట్టు ఉంటుంది. సినిమా టేకింగ్ చాలా బాగున్న కథ లేకపోవటం.. కథనం కూడా రెగ్యులర్ కామెడీ సినిమాలా లాజిక్స్ లేకుండా సాగటం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. చాలా సీన్లు సినిమాటిక్ గా అనిపిస్తాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నికల్ గా చూస్తే కెమెరామెన్ ఆరోన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్. కామెడీ సీన్లతో పాటు కీలక సన్నివేశాలు సినిమాటోగ్రాఫర్ పనితనం ఇక్కడ బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ ఉపేంద్ర వర్మ పనితనం సినిమాకి తగినట్టుగా ఉంది. సినిమా రన్ టైం తక్కువ కావడంతో సీన్లు క్రిస్పీ గానే ఉంటాయి. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ మంచి కథ అంశంతో పాటు మంచి కామెడీని ఉత్కంఠ వరతమైన సీన్లను బాగా రాసుకుని బాగా ప్రజెంట్ చేశాడు. అయితే ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లలో అక్కడక్కడ తడబడినట్టు ఉంటుంది.

ఫైన‌ల్‌గా…
త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కీడా కోలా కామెడీగా సాగుతూ కొన్ని చోట్ల సస్సెన్స్ తో పాటు కొంత యాక్ష‌న్‌… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బాగానే ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడు కామెడీని హ్యాండిల్ చేసిన తీరు సినిమాకు బాగా ప్ల‌స్ అయ్యింది. సెకండాఫ్‌లో కామెడీ సీన్లు ఆస‌క్తిగా ఉన్నాయి. స‌రైన క‌థ లేక‌పోవ‌డం.. క‌థ‌నంలో ఇంట్ర‌స్టింగ్ మిస్ అవ్వ‌డం ఈ సినిమాకు మైన‌స్‌లు. ఓవ‌రాల్‌గా ఏ క్లాస్ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్ ప్రేక్ష‌కులు, కామెడీ సినిమాలు న‌చ్చే వారు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడ‌నే చెప్పాలి.

ఫైన‌ల్ పంచ్‌: కీడా కోలా న‌చ్చినోళ్ల‌కు న‌చ్చుతుంది.. అంతే

కీడా కోలా రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news