Newsబాల‌య్య‌తో నాకు ఆ కోరిక ఉందంటున్న త‌మన్నా..!

బాల‌య్య‌తో నాకు ఆ కోరిక ఉందంటున్న త‌మన్నా..!

నట‌సింహ బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది. బాలయ్య వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి మూడు సూపర్ హిట్ అయ్యాయి. భగవంత్‌ కేసరి సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. బాలయ్యకు మూడు దశాబ్దాల తర్వాత మూడు వరుస సూపర్ డూపర్ హిట్లు పడ్డాయి. తాజాగా దసరాకు భగవంత్‌ కేసరి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం భారీ దర్శకత్వంలో తన కెరీర్‌లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమా సమరసింహారెడ్డి స్టైల్‌లో యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్లు కలగలిసిన స్టోరీ గాను సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ టచ్‌తోను ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలయ్యకు జోడిగా ఎవరిని హీరోయిన్గా ఎంపిక చేస్తారు. అనేదానిపై త‌ర్జన భర్జనలు జరుగుతున్నాయి. డైరెక్టర్ బాబి, మిల్కీ బ్యూటీ తమన్న పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

బాలయ్య – తమన్నా ఇప్పటివరకు జోడి కట్టలేదు. అయితే గతంలో తమన్నా కూడా ఓ సందర్భంలో బాలయ్యతో నటించాలన్న కోరికను వ్యక్తం చేసింది. సీనియర్ హీరోలలో చిరంజీవి, వెంకటేష్ సినిమాలలో తమన్నా నటించేసింది. ఇక నాగర్జున, బాలయ్య మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. ఇప్పుడు బాలయ్యతో ఆమెకి గోల్డెన్ చాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్గా బాబీ.. తమన్నాను ఓకే చేస్తే వెండితెరపై బాలయ్య – తమన్న కాంబినేషన్ తళ్ళుకులు మామూలుగా ఉండవని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news