నటుడు సునీల్, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికీ తెలిసిందే. హైదరాబాద్ పంజాగుట్టలో ఇద్దరు సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒకే గదిలో ఉండేవారు. త్రివిక్రం ట్యూషన్స్ చెబుతూ రచయితగా ప్రయత్నాలు చేస్తుండేవారు. ఇక సునీల్ నటుడవ్వాలని ఇండస్ట్రీలోని ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవారు.
అనుకున్నట్టుగానే త్రివిక్రం శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చారు. అదే సినిమాలో సునీల్ కి మంచి రోల్ రాశాడు త్రివిక్రం. రచయితగా ఇప్పటివరకూ త్రివిక్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే, సునీల్ కూడా నటుడిగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఒకదశలో సునీల్ లేకుండా సినిమా ఉండేది కాదు. చిరంజీవి సైతం ప్రత్యేకంగా తన సినిమాలో సునీల్ పాత్ర ఉండాలని సలహా ఇచ్చారు.
అంతగా కెమెడియన్ రోల్‌తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా కూడా మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఆ సమయంలో త్రివిక్రం బంతి అనే టైటిల్ తో సునీల్ ని పెట్టి హీరోగా సినిమా చేస్తానని చెప్పారు. సునీల్‌తో ఈ మాట ఎన్నిసార్లు చెప్పి ఉంటారో. కానీ, ఉన్నపలంగా సునీల్ కి ఫ్లాపులొచ్చాయి. హీరోగా ఆయన కి అవకాశాలు తగ్గిపోయాయి.
ఆ సమయంలో త్రివిక్రం అన్న మాట నిలబెట్టుకొని బంతి సినిమా తీసి హిట్ ఇచ్చి ఉంటే సునీల్ కెరీర్ ఇంకోలా ఉండేదేమో. కానీ, త్రివిక్రం అందరూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ సునీల్ కి ఇచ్చిన మాట తప్పాడు. బంతి ఏమైందో తెలీదు. అయితే, తన సినిమాలలో మాత్రం ఏదో ఒక పాత్ర రాస్తూ సునీల్ కి మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలో విలన్ గా నటించి బాగానే నిలదొక్కుకున్నాడు సునీల్. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్‌లో త్రివిక్రం సునీల్ తో చేస్తా అన్న బంతి సినిమా లేకపోవచ్చు.