ఈ మధ్యకాలంలో యువత వయసుకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడం లేదు . ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు . అయితే యువత మాత్రం ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని.. అది ఎన్ని సంవత్సరాలు దాటినా సరే… ఆ తర్వాతే పెళ్లి అని కొందరు మూర్ఖంగా ఉంటున్నారు . అయితే మరి కొంతమంది ఆ డెసిషన్ను కరెక్ట్ అంటున్నారు . కాగా ఈ క్రమంలోనే శృతిహాసన్ సైతం అలాంటి టఫ్ కామెంట్స్ ఫేస్ చేసింది అంటూ చెప్పుకొచ్చింది .
కమలహాసన్ కూతురుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ పలు సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ తన జీవితంలో వచ్చిన మార్పులపై స్పందించింది . ఆమె మాట్లాడుతూ ..”నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా లేను.. చాలా చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నాను . మనసు బాగుంటే మనిషి ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటాడు . కొన్నాళ్ల క్రితం వరకు అందరూ నా పెళ్లిపై ఎన్నెన్నో మాట్లాడారు “.
“నా వయసుకు పెళ్లి చేసుకోవాలి అని వెటకారంగా కౌంటర్ వేశారు . 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకోవాలి అనేది ఒక రూలా ..? 30 దాటాక పెళ్లి చేసుకోక పోతే నేరమా..? దాని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా..? అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్స్ వేసింది”. అందుకే నేను అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు అని.. నేను చేసే పనిలో నేను హ్యాపీగా ఉన్నానని .. నా గురించి ఒకరు బాధపడాల్సిన అవసరం లేదు అంటూ కూసింత ఘాటుగానే చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె చెసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!