తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ సోనాలి బింద్రే. మహారాష్ట్రాకి చెందిన సోనాలి..19 ఏళ్ళకే హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆగ్. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లో సోనాలీ లాంటి ఫిజిక్ ఉన్న హీరోయిన్ లేదు. అంతేకాదు, నాజూకు అందాలతో మంచి హైట్ కలిగి ఉండటం బాలీవుడ్ ఎంట్రీకి బాగా కలిసి వచ్చింది.
హిందీలో నటించిన మొదటి సినిమా బాగా గుర్తింపు తేవడంతో వరుసగా అరడజను సినిమాలకి పైగానే సైన్ చేసింది. సోనాలి నటించిన సినిమాలు 1995లో ది డాన్ , గద్దర్, టక్కర్ రిలీజ్ అయ్యాయి. ఇక అదే సంవత్సరం బొంబాయి మూవీలో ” హమ్మా హమ్మా ” పాటలో స్పెషల్ అపీరియన్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సాంగ్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ రకంగా సోనాలీకి మరింత క్రేజ్ పెరిగింది.
దాంతో రెండేళ్ళపాటి ఖాళీ లేనన్ని సినిమాలు సైన్ చేసింది. 1996లో 5 సోనాలీ నటించిన 5 సినిమాలు విడుదలయ్యాయి. రక్షక్, ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్, అప్నే దామ్ పర్, సపూత్, అజయ్ దేవగన్‌తో దిల్జాలే, ఇది నిరూపించబడింది. ఆ తర్వాత సునీల్ శెట్టితో భాయ్, అక్షయ్ కుమార్‌తో తారాజు.. సన్నీ డియోల్‌తో కహర్ సినిమాలు చేసింది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 6 ఏళ్ళపాటు తిరుగులేని స్టార్ డం ని కొనసాగించింది.
ఆ క్రేజ్ వల్లే ఆమె తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంది. మురారి సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ గా చాలామందిని అనుకున్నారు. కాని, వాళ్ళు చివరి నిముషంలో హ్యాండిచ్చారు. దాంతో దర్శకుడు కృష్ణవంశీ సోనాలీని కలిసి కథ చెప్పాడు. ఆమెకి ఈ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకుంది. అలా మురారి సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇంద్ర, ఖడ్గం, శంకర్ దాదా ఎం ఎం బి బి ఎస్, మన్మధుడు చిత్రాలు చేసింది.
ఈ సినిమాలన్నీ తెలుగులో బ్లాక్ బస్టర్స్. సోనాలీకి తెలుగులో నటించిన అన్నీ సినిమాలు సూపర్ సక్సెస్ ని ఇచ్చాయి. అయితే, సోనాలి శంకర్ దాదా సినిమా కోసం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అదేమిటంటే సినిమా రిలీజైయ్యాక ఇంకో పాటను అదనంగా జత చేయాలనుకున్నారు. దీనికోసం మూడు రోజులు సోనాలి డేట్స్ అడిగారు మేకర్స్. అప్పటికే ఆమె 3 నెలల గర్భవతి. అయినా సినిమా కోసం ఒప్పుకుంది. మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి ఈ సాంగ్ చిత్రీకరించారు. దాన్స్ మాటర్ కూడా సోనాలికి చాలా సింపుల్ స్టెప్స్ కంపోజ్ చేశారు. ఇంకో హీరోయిన్ అయితే ఇలాంటి వాటికి ఒప్పుకునేది కాదు.