బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా టైగర్ 3. యాష్‌రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ స్పై లైన్‌లో భాగంగా రిలీజ్ అవుతున్న ఐదో సినిమా ఇది. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన అతడి మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ నటించింది. దీపావళి కానుకగా భారీ అంచనాల మధ్య ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ టైగర్ 3 సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్‌తో పాటు.. దేశవ్యాప్తంగా టైగర్ 3 ఫై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే పలుచోట్ల ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు సీక్వెల్ గా వచ్చిన టైగర్ 3 సినిమాకి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది సినిమా అదిరిపోయింది అని చెబుతుంటే. మరి కొంతమంది బాగోలేదని కామెంట్లు పెడుతున్నారు.
షారుక్ ఖాన్ నటించిన రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పఠాన్, జవాన్ సినిమాలతో పోలుస్తూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదని అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్లు బాగున్నా కథ కొనసాగుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. టైగర్ 3 రోరింగ్ బ్లాక్ బస్టర్.. మనీష్ శర్మ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఎమోషన్స్ తో పాటు, యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారని కొందరు చెబుతున్నారు. స్పై థ్రిల్లర్ సినిమాలకు బాస్‌గా ఈ సినిమా ఉందని సల్మాన్ కు మంచి కమ్‌బ్యాక్ మూవీ, ఇమ్రాన్ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టేసిందని కొందరు చెబుతున్నారు.
కొందరు నెటిజన్లు టైగర్ అంచనాలను అందుకోలేదని.. సల్మాన్ చాలా నీరసంగా కనిపించాడు సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెంట్ లో పవర్ తగ్గింది.. షారుక్ తన సినిమాలను ఒక రేంజ్‌కు తీసుకు వెళితే సల్మాన్ ఆ స్థాయిలో అంచనాలు అందుకోలేదని, కత్రినా తన పరిధి మేరకు చక్కగా నటించిందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పూర్తి రివ్యూ వస్తే టైగర్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర గర్జించిందో లేదో తేలిపోనుంది.