టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ కోసం కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. ఇండియన్ సినీ జనాలు కళ్లుకాయలు కాచేలా గత రెండేళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ సీరిస్ సినిమాలతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ 1 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్లలోకి రానుంది.
ఇక సలార్ సినిమా బిజినెస్ ఏపీ, తెలంగాణలో కళ్లు చెదిరే రేటుకు జరుగుతోంది. ఒక్కో ఏరియాను బడాబడా నిర్మాతలు కొనేస్తున్నారు. వెస్ట్ రైట్స్‌ను గీతా అధినేత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఏపీలో సీడెడ్ కాకుండానే రు. 85 కోట్లకు అమ్మారు. ఇక నైజాం రైట్స్‌ను మైత్రీ మూవీస్ ఏకంగా 90 కోట్ల 6 లక్షల రూపాయలకి సొంతం చేసుకుంది. ఇది అలాంటి ఇలాంటి సెన్షేషన్ కాదనే చెప్పాలి.
ఈ రు. 90 కోట్లలో 65 కోట్ల రూపాయలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కాగా, 25 కోట్ల 6 లక్షల రూపాయలు రిఫండబుల్ అడ్వాన్స్ బేస్ మీద మైత్రీ వాళ్లకు హక్కులు సొంతం అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పాలి. ఈ రైట్స్ కోసం నైజాం కింగ్ దిల్ రాజు చివరి వరకు ప్రయత్నాలు చేసి వదులుకున్నారు.
ఇక సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మ్యూజిక్ రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు.