News' స‌లార్‌ ' .. ఫ్యాన్స్ ఆశ‌లన్నీ ఆ పాయింట్ మీదే......

‘ స‌లార్‌ ‘ .. ఫ్యాన్స్ ఆశ‌లన్నీ ఆ పాయింట్ మీదే… లేక‌పోతే అంతే సంగ‌తి…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా సలార్. సలార్‌ సినిమాపై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. బాహుబలి సిరీస్ సినిమాలు, ఆ తర్వాత వరుసగా సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగు, తమిళం, సౌత్ ఇండియా మాత్రమే కాదు నేషనల్ లెవెల్‌లో సినీ అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే సలార్ సినిమాలో సాంగ్స్ లేవని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఒక ఐటెం సాంగ్ ఉంటుందన్న లీకు ఇప్పటికే వచ్చింది. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ ఐటెం సాంగ్‌లో ప్రభాస్ కనిపించారట. ఆయన పాత్ర ఈ సాంగ్‌లో ఉండదట. ఇది క‌చ్చితంగా అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ మీదే ఆశలు పెట్టుకున్నారు.

తెలుగు నేటివిటికి అనుగుణంగా పాటలు లేకపోతే ఇక్కడ ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు ? అన్నది సందేహమే. ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్లతో డ్యూయెట్ల‌తో పాటు పాటలు కూడా ఉండాలి. అటు ప్రభాస్ గత మూడు సినిమాలు అంచనాలు అందుకోలేదు. దీంతో కేజిఎఫ్ సిరీస్ అందించిన ప్రశాంత్ నీల్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండడంతో ప్రభాస్ అభిమానులు సలార్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే సలార్‌లో డ్యూయెట్లు, ఐటమ్ సాంగ్ లో హీరో స్టెప్పులు వంటి రొటీన్ ఫార్ములాలు ఉండవు.

కేజీఎఫ్ మాదిరిగా.. ఎమోషనల్ యాక్షన్ సినిమాగా సలార్ తెరకెక్కుతుంది అనుకోవాల్సిందే. అయితే ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టి అందులో ప్రభాస్ లేకపోవడం అంటే కాస్త ఇబ్బందికర విషయమే. ఏది ఏమైనా సినిమాలో బీభత్సమైన యాక్ష‌న్‌, ఎమోషన్ కనెక్ట్ అయితేనే సలార్ బాక్సాఫీస్ దగ్గర బాగా క్లిక్ అవుతుంది. మరి ప్రశాంత్ నీల్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news