సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరీర్లో మరపురాని సినిమాలలో భాషా ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రజినీకాంత్‌ను సౌత్ ఇండియాలోనే తిరిగిలేని సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. ముంబై మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. రజినీకాంత్‌కు జోడిగా నగ్మా హీరోయిన్గా నటించిగా.. సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో భాష ఒక ట్రెండ్ సెట్ చేసింది.
ఈ సినిమా ఒక సెన్సేషన్ ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ రజనీకాంత్ సినిమాలలో బాషాకు ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. బాషా తర్వాత మరోసారి సురేష్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్లో బాషాను మించిన రేంజ్లో సినిమా తీయాలని బాబా సినిమా తీసిన అది డిజాస్టర్ అయింది. అయితే ఇనేళ్ళకు కోలీవుడ్ యువ దర్శకులలో ఒకరైన అట్లీ రజనీకాంత్‌తో బాషా రేంజ్లో మళ్లీ సినిమా తీస్తున్నానని చెప్పారు.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో జవాన్ మూవీ తెరకెక్కించి కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నాడు. గతంలో విజయ్, ఆర్యలతో మంచి సూపర్హిట్లు కొట్టిన అట్లీ త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నాడు. ఇక రజనీకాంత్‌తో సినిమా గురించి మాట్లాడుతూ ఇటీవల రజనీగారితో రెండు మూడుసార్లు స్టోరీ డిస్కషన్లు జరిగాయని.. కొన్ని కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదని రజనీ గారితో శంకర్ గారు తెరకెక్కించిన రోబో సినిమాకి అసిస్టెంట్‌గా పని చేశానని అట్లీ చెప్పాడు.
కచ్చితంగా రజనీకాంత్ గారితో సినిమా చేస్తే బాషా రేంజ్ మూవీ చేస్తానని అట్లీ చెప్పాడు. ఆయనని పీక్ రేంజ్లో చూపించాలని తన కోరిక అని అట్లీ అన్నాడు. ఇక రజనీ గారు తనని కన్నా అని ఎంతో ఆప్యాయతతో పిలుస్తారని.. అలానే తన డైరెక్షన్లో చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అని.. రజనీ గారు చెప్పినట్టు అట్లీ తెలిపాడు.