Newsవావ్ కేక‌... అల్లు హీరోతో ఎన్టీఆర్ కాంబినేష‌న్‌...!

వావ్ కేక‌… అల్లు హీరోతో ఎన్టీఆర్ కాంబినేష‌న్‌…!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తుండగా హీరోయిన్గా జాన్వీకపూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ హిట్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా దేవర. దీంతో దేవర సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు మామూలుగా లేవు. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది.

ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్‌2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ సినిమాలో చేయనున్నాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ లో అందరికి క్లోజ్‌గా ఉంటాడు. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీగా మల్టీస్టారర్ సినిమాలో నటించి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి తాను రెడీ అని ప్రకటించాడు. మ‌రో మెగా హీరో అల్లు అర్జున్‌ను బావా అని సంబోధిస్తూ బ‌న్నీ ఫ్యామిలీతో స్నేహంగా ఉంటాడు.

తాజాగా ఒక ఫంక్షన్ లో అల్లు వారి యంగ్ హీరో శిరీష్, ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో శిరీష్‌ ఎన్టీఆర్‌ని హగ్ చేసుకుని ఉన్నాడు. స్నేహితులు, కుటుంబం లేదా అభిమానులు ఎవరైనా ఫోటో కోసం అడిగినప్పుడల్లా నాకు ఎన్టీఆర్ నుంచి అదే ఆప్యాయత ప్రేమ కనిపిస్తుంది.. ఆయనది అత్యంత దయగల హృదయం అంటూ శిరీష్‌ తన పోస్టులో తెలిపాడు. వీరిద్దరి బ్యూటిఫుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news