Newsబాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే.. ఆ బిగ్గెస్ట్ బ్లాక్...

బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే.. ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ప్రజెంట్ యంగ్ హీరోస్ ఒక్క సినిమా హిట్ కొట్టలేక అల్లాడిపోతుంటే.. బాలయ్య మాత్రం బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లమీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. కాగా రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోని సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే పూజ హెగ్డే బాలయ్య కాంబోలో మిస్సయిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. బాలయ్య పూజా హెగ్డే కాంబోలో మిస్ అయిన సినిమా వీరసింహారెడ్డి . ఈ సినిమాలో యంగ్ బాలయ్య సరసన శృతిహాసన్ నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే శృతిహాసన్ స్థానంలో పూజా హెగ్డేను అనుకున్నారట గోపీచంద్ మలినేని .

కానీ పూజ హెగ్డే ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. బాలయ్య తనకంటే ఏజ్ లో చాలా పెద్దవాడు కావడం ..పైగా అప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలేస్తూ ఉండడం ఆమెను ఈ సినిమా ఒప్పుకొనివ్వకుండా చేశాయి అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news