రంగస్థలం సినిమా తర్వాత అనసూయ భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పెదకాపు 1 అని చెప్పాలి. ఇన్నాళ్లు తనను రంగమ్మత్త అని పిలిచారని.. పెదకాపు 1 రిలీజ్ అయ్యాక ఆ పాత్ర పేరుతో తనను పిలుస్తారని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా పెద్ద ప్లాప్ అయింది. ఈ సినిమాలో తన అవగాహనకు అందని కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే వాటి గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఎప్పుడు డిస్కస్ చేయలేదని అంటుంది.
ఈ సినిమాలో కొన్ని మన ఆలోచనకే అందవు.. కానీ దర్శకుడు ముందు నేనంత.. బహుశా ఆయన విజన్ నాకు అర్థం కాలేదేమో.. నాలాగే చాలామంది ఆడియన్స్ కూడా ఈ సినిమా అర్థం కాలేదు అనుకుంటా.. అయితే ఆ సినిమాను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అని తెలిపింది. శ్రీకాంత్ అడ్డాల తాను అనుకున్నది సాధించాడని భావిస్తున్నానని కూడా అనసూయ వ్యాఖ్యానించింది. ఇక ఈ సినిమాలో తన సీన్లు కొన్ని కట్ చేశారని విషయాన్ని కూడా ఆమె అంగీకరించింది.
ఈ విషయంలో నాకు దర్శకుడు శ్రీకాంత్ కు మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదని కూడా చెబుతోంది. నా పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు కట్ అయ్యాయి.. కథతో కనెక్షన్ మిస్ అయిందని నాకు అనిపించింది. అలా కట్ చేయడం తప్పు కూడా కాదు. ఈ విషయంలో శ్రీకాంత్ అడ్డాలకు నాకు గొడవలు లేవు. పైగా పార్ట్ 2 కూడా వస్తోంది. పార్ట్ 1 లో అర్థం కాని విషయాలు పార్ట్2 లో అర్థమయ్యేలా చెబుతారేమో అంటూ మాట్లాడింది.
ఏది ఏమైనా తన సీన్లు కట్ చేయడం వల్ల సినిమాలో కథతో కనెక్షన్ మిస్ అవటం వల్లే సినిమా ప్లాప్ అయ్యింది అంటూ అర్థం వచ్చేలా అనసూయ మాట్లాడింది. తన సీన్లు బాగా ఎడిట్ చేయడంతో ఆమె అసహనానికి గురైనట్టు కూడా ఆమె మాటలు చెబుతున్నాయి. అయితే సినిమా ఇప్పటికే డిజాస్టర్ అయింది. ఇప్పుడు అంతా అయిపోయాక అనసూయ ఇలా మాట్లాడటం ఏంటని ? చాలామంది చెవులు కోరుక్కుంటున్నారు.