Newsమ‌హేష్ ' గుంటూరు కారం ' సాంగ్ లీక్ అయ్యింది... సాంగ్...

మ‌హేష్ ‘ గుంటూరు కారం ‘ సాంగ్ లీక్ అయ్యింది… సాంగ్ కేక పెట్టించిందిగా…!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో ఫస్ట్ సింగిల్ కోసం మహేష్ బాబు – త్రివిక్రమ్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా ? అని ఒకటే ఆసక్తితో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాలో పాటలు బాగుంటాయి. మహేష్ సినిమా అంటే ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఉండరు.

అందువల్ల ఆ సినిమాలో ఫస్ట్ సింగిల్ కోసం ఆగస్టు నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నా.. మేకర్స్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్ లో సాంగ్ రిలీజ్ ఉంటుందని అంటున్నా.. అది కూడా ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆడియో క్లిప్ లీక్ అయింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి అంటూ ప్రారంభమైన ఈ బిట్‌లో.. బిర్యానీ, అరకోడి, మసాలా లాంటి మాస్‌పదాలు చోటుచేసుకున్నాయి.

పాట ప్రారంభంలో వచ్చే చిన్న బిట్ కాబట్టి అది కూడా జస్ట్ ట్రాక్ అయి ఉంటుంది. దీంతో ఈ సాంగ్‌ను ఎలా చేశారు ? అన్నది అప్పుడే చెప్పలేము. గతంలో త్రివిక్రమ్ నుంచి వచ్చిన అ.. ఆ సినిమాలో పాట సౌండింగ్ అలాగే ధూమచారే.. ధూమ‌చారే అనే బిట్ సౌండింగ్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ఆడియో క్లిప్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సాంగ్‌ను సెట్టు లో ప్లే చేసినప్పుడు ఎవరో ఫోన్లో రికార్డు చేసి ఉండొచ్చని అనుమానాలు యూనిట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఏది ఏమైనా గుంటూరు కారం సినిమా నుంచి త్వరగా ఏదో ఒక ఆడియో సాంగ్ వదిలితే తప్ప ఫ్యాన్స్ సంతృప్తి చెందేలా లేరు. మహేష్ బాబు కి జోడిగా మీనాక్షి చౌదరి, శ్రీ‌లీల‌ హీరోయిన్లుగా నటిస్తుండగా థ‌మన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news