Moviesలావణ్య-వరుణ్ ల పెళ్లికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే...

లావణ్య-వరుణ్ ల పెళ్లికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..దట్ ఈజ్ పవర్ స్టార్..!!

అయిపోయింది .. కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. ఇటలీలో వీళ్లిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారు . అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . మెగా ఫ్యామిలీ ఇటలీలో ఎంజాయ్ చేసిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .

వీళ్ళ పెళ్లికి చాలా మంది ప్రముఖులు చాలా ఖరీదైన బహుమతులు పంపించినట్లు తెలుస్తుంది . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి వీళ్ళ పెళ్లికి స్పెషల్గా 2 కోట్లు విలువ చేసే డైమెండ్ సెట్ ని గిఫ్ట్ గా అందజేశారట . అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. వరుణ్ కి లావణ్యలకి కార్ల పిచ్చి ఉందట .

డిఫరెంట్ డిఫరెంట్ కార్లు అంటే వాళ్ళకి తెగ ఇష్టమట . అందుకే వీళ్ళ కోసం ఓ స్పెషల్ కారును డిజైన్ చేయించి మరి వాళ్ళ లక్కీ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించి వరుణ్ లావన్య లకు గిఫ్ట్ గా ఇచ్చారట . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎన్ని బహుమతులు ఇచ్చిన వాళ్ళకి ఇష్టమైన బహుమతిని బహుమతిగా ఇస్తే ఆ బహుమతి వాల్యూనే పెరిగిపోతుంది అంటున్నారు ఆ బహుమతి చాలా చాలా స్పెషల్ అంటున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news