Newsఊర‌మాస్ లుక్‌లో బాల‌య్య‌... అఖండ‌ను మించిన అరాచ‌కం...!

ఊర‌మాస్ లుక్‌లో బాల‌య్య‌… అఖండ‌ను మించిన అరాచ‌కం…!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌ మీదున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి.. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో కూడా వ‌రుస‌గా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యకు దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత హ్యాట్రిక్ హిట్లు ద‌క్కాయి. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో బాల‌య్య మిడిల్ ఏజ్ వ‌య‌స్సున్న వ్య‌క్తి పాత్ర‌లో అది కూడా గ్రే హెయిర్ తో కనిపించాడు. బాలయ్య ను భగవంత్ కేసరిగా చూసి అభిమానులు చాలా షాకింగ్‌గా సర్ ప్రైజ్ అయ్యారు.

బాలయ్య ఇటీవ‌ల కాలంలో.. ప్ర‌తి సినిమాలోనూ స‌రికొత్త‌గా క‌న‌ప‌డుతున్నారు. లెజెండ్‌లో ఒక‌లా, ఆ త‌ర్వాత శాత‌క‌ర్ణిలో మ‌రోలా క‌నిపించి ఔరా అనిపించారు. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు సినిమాల‌లో వేరియేష‌న్స్ అదిరిపోయాయి. ఆ త‌ర్వాత అఖండ‌లో అఘోరాగా క‌నిపించి టాలీవుడ్‌కు పూన‌కాలు తెప్పించారు. బాల‌య్య త‌ప్పా ఈ పాత్ర ఎవ్వ‌రూ వేయ‌లేర‌న్నంత పేరు బాల‌య్య అఘోరా పాత్ర‌కు వ‌చ్చింది.

ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి సినిమాలో బాల‌య్య ఫ్రెష్‌లుక్స్‌లో క‌నిపించాడు. ఇక భ‌గ‌వంత్ కేస‌రిగా మిడిల్ ఏజ్ పాత్ర‌, నెర‌సిన గ‌డ్డంలో బాల‌య్య బ్యూటిఫుల్ లుక్ బాగుంది. ఈ లుక్‌లో బాల‌య్య మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌కు కూడా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చాడు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న 109వ సినిమాను బాబి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్ప‌టికే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.

సితార బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాల‌య్య పాత్ర కోసం బాబి మూడు కొత్త లుక్‌లో వేయించాడ‌ట‌. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఒక లుక్ అయితే ఊర‌మాస్ స్టైల్లో అదిరిపోతుంద‌ని.. అఖండ‌ను మించిన అరాచ‌కం ఉంటుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news