Newsఓరి దేవుడోయ్..ఆ విధంగా సమంత తల్లి కావాలి అనుకుంటుందా..? ఎవ్వరమ్మ నీకు...

ఓరి దేవుడోయ్..ఆ విధంగా సమంత తల్లి కావాలి అనుకుంటుందా..? ఎవ్వరమ్మ నీకు ఈ సలహా ఇచ్చిన పెద్ద మనిషి..?

సమంత .. ఈ పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఎప్పుడైతే సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందో అప్పట్నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మరింత స్థాయిలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగ ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి ఆమె ఎంతో ఇష్టమైన సినిమాలు సైతం దూరం పెట్టి పలు దేశాలు తిరుగుతూ జబ్బుకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది .

కాగా సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. అయితే సమంత రెండో పెళ్లి పై తాజాగా సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తల వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి సమంత పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సమంత రెండో పెళ్లిపై తన పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత వయసు 36 ఏళ్ళు దాటేస్తుంది .

ఈ వయసులో ఎవరైనా సరే పెళ్లి చేసుకొని తమకంటూ ఒక తోడు కావాలని కోరుకుంటారు. అదే తోడు నీకు ఉండాలని కోరుకుంటున్నాము అంటూ వాళ్ళ పేరెంట్స్ రెండో పెళ్లిపై ఫోర్స్ చేస్తున్నారట. లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కామన్ .. వాటిని ఫేస్ చేసే ముందుకు వెళ్లాలి అంటూ సమంత తల్లి ఆమె రెండో పెళ్లిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందట . అయితే సమంతకు మాత్రం రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట . ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకొని తల్లిగా తాను మారాలి అనుకున్న ప్లేస్ లోకి మారుతూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుందట . మయోసైటిస్ వ్యాధి కొంచెం తగ్గినా సరే సమంత దత్తత తీసుకునే పిల్లలకి సంబంధించిన విషయం పై ఫోకస్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news