News"నాకు భర్త కావాలంటే ఆ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే".. శ్రీలీలకు ఆ...

“నాకు భర్త కావాలంటే ఆ మూడు ఖచ్చితంగా ఉండాల్సిందే”.. శ్రీలీలకు ఆ కోరికలు ఎక్కువే..ఎంత ఓపెన్ గా చెప్పేసిందో చూడండి..!!

ప్రెసెంట్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని నిద్రలో లేపి అడిగిన చెప్పే పేరు శ్రీ లీల . పేరుకు కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ అందాల ముద్దుగుమ్మ చేతిలో పదికి పైగానే బడా ప్రాజెక్ట్స్ లు పట్టుకొని ఇండస్ట్రీని అల్లాడిస్తున్న శ్రీ లీల రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాలో నటించి హిట్ కొట్టింది .

త్వరలోనే ఆదికేశవ సినిమా తో మన ముందుకు రాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ తో ముచ్చటించిన శ్రీ లీలకు తనకు కాబోయే హస్బెండ్ క్వాలిటీ ఎలా ఉండాలి అన్న ప్రశ్న ఎదురయింది . జనరల్ గా ఇలాంటి ప్రశ్న ఎదురైతే ఏ హీరోయిన్ అయినా ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. నాకు అలాంటి ఆశలు లేవు అంటూ చెప్పుకొస్తుంది .

అయితే శ్రీ లీలా మాత్రం ఉన్నది ఉన్నట్లు క్లియర్ గా చెప్పేసింది. ” నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి మూడు క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలి అనుకుంటాను ….మొదటిది గట్స్ ఎందుకంటే నా లిస్టులో చాలా ఎక్కువే ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్నిటికీ మ్యాచ్ అవ్వాలి . రెండో క్వాలిఫికేషన్ నాకు కాబోయే భర్త మంచి సెన్సాఫ్ హ్యూమర్ హాస్య చతురత ఉండాలి.. మూడో క్వాలిటీ నాకు కాబోయే భర్త లుక్స్ పరంగా కాస్త ఫ్యామిలీ గా ఉండాలి పద్ధతిగా కనిపించాలి.. ముఖ్యంగా మా అమ్మకు నచ్చాలి “అంటూ ఓపెన్ గా తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పుకొచ్చింది శ్రీ లీల . దీంతో కొందరు శ్రీ లీల టేస్ట్ ను వెరీ నైస్ అంటుంటే మరి కొందరు అయితే నీకు ఈ జన్మలో పెళ్లి కాదులే అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news