టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇప్పటికీ ఎన్టీఆర్ను వెండి తెర మీద చూడలేదు. ఎన్టీఆర్ అభిమానులు అయితే తమ అభిమాన హీరో సినిమా కోసం ఆకలి మీద ఉన్నారు.
దర్శకుడు కొరటాల శివ దేవర షూటింగ్ శరవేగంగా నడిపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావటంతో కొరటాల ఎక్కడ రాజీ పడడంలేదు.
ఈ సినిమా కథ మీద ఏకంగా ఏడాదిన్నర పాటు పని చేశారంటే కొరటాల ఎంతో కష్టపడి దేవర సినిమా తెరకెక్కిస్తున్నారు తెలుస్తుంది. దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీ తొలిభాగం వచ్చేయాడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ కండల వీరుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా రెండో షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. శంషాబాద్లో 15 రోజులపాటు కంటిన్యూగా కొన్ని సీన్లు షూట్ చేస్తారని ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో ప్రధాన తారాగణం మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక శంషాబాద్లో జరిగే షెడ్యూల్లో ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్రపై షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.
ఆ రెండో హీరోయిన్ ఎవరు ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మెయింటైన్ చేస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశ పఠానీ లేదా మరో బాలీవుడ్ హీరోయిన్ను ఈ పాత్రకు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో కొరటాల క్లారిటీ ఇవ్వనున్నారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ – యవసుధా ఆర్ట్స్ సంస్థలపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలిని సుధాకర్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు.