సినీ ఫిల్డ్‌లో అనేక రూమర్లు ఉన్నట్టుగానే కొందరు హీరోయిన్లు కూడా.. అలానే వ్యవహరించేవారు. అప్పటి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత మీడియా లేదు. ప్రస్తుతం ఫాలో అవుతున్నంత సోషల్ వేదికలు కూడా లేవు. దీంతో కొన్ని కొన్ని పత్రికల్లో వచ్చే కథనాలు.. ఫొటోలకు పిచ్చ ఫాలోఅప్ ఉండేది. అదే నిజమని కూడా అనుకునేవారు. ఇలానే ఓ వారపత్రికలో అప్పటి హీరోయిన్ కాంచనమాల… ఇంటర్వ్యూ వేశారు.
కాంచనమాల.. వెండితెర ఇలవేల్పుగా సాగుతున్న రోజులు అవి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఆమె అభినయాని కి జేజేలు పలికేవారు. ఆమె గాయకురాలు, దర్శకురాలు, నిర్మాత, సంగీత దర్శకురాలు కూడా. అయితే.. ఆమెతో ఎన్టీఆర్ చాలా చాలా తక్కువ సినిమాలు చేశారు. దీనిపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో చేసేందుకు తాను ఇబ్బంది పడేదాన్నని చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. ఎన్టీఆర్ అభినయం ముందు తట్టుకునేందుకు.. అప్పటి తారలు కొంత ప్రాక్టీస్ చేసేవారు.
దీనిని ఉటంకిస్తూ.. కాంచనమాల ఇలా చెప్పుకొచ్చారు. కానీ, సదరు పత్రిక ఎడిటర్ దీనికి మరింత మసాలా జోడించి.. ఎన్టీఆర్ నలిపేస్తాడు.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది జోరుగా వైరల్ అయింది. అప్పటి సినిమాల్లో హీరోయిన్లను కౌగిలించుకోవడం వంటివి పెద్దగా ఉండేవి కాదు. అయినప్పటికీ.. ఎన్టీఆర్ సినిమాల్లో అప్పుడప్పుడే.. మొదలు పెట్టారు. ఈ పరిణామాలతో కాంచనమాల అందుకే.. ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడం లేదనే ప్రచారం వచ్చింది.
అయితే.. పత్రిక ప్రింట్ అయిపోయి.. రెండు నెలల తర్వాత.. అన్నగారు ఈ విషయాన్ని కాంచనమాలతో అన్నారు. ఏమండీ ఇది తగునా? మీవంటి వారు.. నాబోటి చిన్న హీరోపై ఇలా కామెంట్ చేస్తారా? నా బిజినెస్ దెబ్బతీస్తారా? అన్నారు. దీంతో ఆమె తడబడి.. విషయం తెలుసుకుని ఎడిటర్‌తో సారీ చెప్పించారట.