Newsఅంద‌రూ ప‌క్క‌న పెట్టేసినా ఆ హీరోయిన్‌ను ఓదారుస్తోన్న నితిన్‌... అంత ప్ర‌యార్టీ...

అంద‌రూ ప‌క్క‌న పెట్టేసినా ఆ హీరోయిన్‌ను ఓదారుస్తోన్న నితిన్‌… అంత ప్ర‌యార్టీ ఇస్తున్నాడా..!

యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్న అనుకున్న స్థాయిలో హిట్లు రావడం లేదు. డిసెంబర్లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. శ్రీ‌లీల‌ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాతో హిట్ కొడతానన్న ధీమాతో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే అందరూ పట్టించుకోకుండా వదిలివేసిన ఓ యంగ్‌ బ్యూటీని ఇప్పుడు నితిన్ తన సినిమాలో ఛాన్స్ ఇస్తూ ఓదారుస్తున్నాడు అన్న గుసగుసలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి.

సూపర్ హిట్లు కొట్టిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్ హీరోగా మరో సినిమా వస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ‌ సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి జోడి కడుతున్నారు. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నబా నటేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని టాక్. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక నభా నటేష్ తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

నన్ను దోచుకుందువటే, అదిగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు చేసిన ఆమె కెరీర్ పుంజుకోలేదు. కనీసం మిడిల్ రేంజ్ హీరోల పక్కన కూడా అనుకున్న స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో అందరూ వదిలేసిన నితిన్ ఆమెకు పిలిచి తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా నభా నటేష్ కెరీర్ మ‌లుపు తిరుగుతుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news