Newsస్వీటీ పేరు అనుష్కగా మార్చిన నాగార్జున.. ఆ పేరును ఎక్కడ నుంచి...

స్వీటీ పేరు అనుష్కగా మార్చిన నాగార్జున.. ఆ పేరును ఎక్కడ నుంచి కొట్టేసారో తెలుసా..?

టాలీవుడ్ స్వీటీ.. అనుష్క శెట్టి అందం, అభినయానికి మరో రూపం అని చెప్పాలి. ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫేమ్‌ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అనుష్క శెట్టి ఒకరు. అనుష్క నవంబర్ 7న కర్ణాటకలోని తుళు భాష మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తుతోంది. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్గా పనిచేశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా సూపర్. ఈ సినిమా కోసం దర్శకుడు పూరి ముంబైలో హీరోయిన్ల వేట మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే అనుష్క పేరుని పూరీకి ఒకరు చెప్పగా.. ఒక హోటల్లో ఆమెను కలుసుకున్నారట. ఆ టైంలో పూరి అనుష్కని నీకు యాక్టింగ్ వచ్చా, డ్యాన్స్ వచ్చా ? అని అడిగితే ఆమె వచ్చు రాదు అని కాకుండా ఏమో తెలియదు అని ఆన్సర్ చెప్పేపాటికి పూరికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందట.

అయితే అనుష్క హైట్, అందం పూరికి బాగా నచ్చడంతో ఆమెను ఒప్పించి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ కు వెళ్లే ముందు కొద్దిరోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ పై శిక్షణ ఇచ్చారు. అనుష్క అసలు పేరు స్వీటీ.. సినిమాల్లో ఈ పేరు బాగోదు ఒక మంచి పేరు పెట్టాలని నాగార్జున, పూరి ఆమెకు పేరు పెట్టే బాధ్యత తీసుకున్నారట. సూపర్ సినిమాలో మిల‌మిల మిల మెరిసే క‌నుల‌కు ఎందుకో ? అస‌లెందుకో ? అనే పాట ఉంటుంది.

ఆ పాట నాగార్జున – ఆయేషా టాకీయ పై వస్తుంది. ఆ పాట పడటానికి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌహ‌తా ముంబై నుంచి ఒక లేడీ సింగ‌ర్‌ను తీసుకువ‌చ్చార‌ట‌. ఆమె పేరు అనుష్క. ఆ పేరు బాగుంది కదా అని చెప్పి అనుష్కకు పెట్టేసారట. అలా స్వీటీ పేరును నాగార్జున, పూరీ కలిసి అనుష్క గా మార్చేశారు. చివరకు స్వీటీ కాస్త అనుష్క‌గా స్థిరపడిపోయింది. అనతి కాలంలోనే ఆమె సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news