జనరల్ గా పెద్ద సినిమాలలో ఏ హీరోయిన్ ని పెట్టాలి.. ఏ హీరోయిన్ పెడితే మార్కెట్ బాగుంటుంది .. సినిమాకి క్రేజ్ వస్తుంది అని మేకర్స్ హీరోలతో చర్చిస్తూ ఉంటారు . మొత్తానికి హీరోస్ దే ఫైనల్ డెసిషన్ అన్న విధంగా మాట్లాడేస్తారు . ఆ హీరోలు కూడా ఏ బ్యూటీ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది.. ట్రెండ్ అవుతుంది అన్న విషయాలను గమనించి ఇతర ఇతర క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు .
చాలామంది పెద్ద హీరోలు ఇంతే ..అయితే నాగార్జున కూడా అలా తన సినిమాలో హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటాడు . కానీ, నాగార్జున తన సినిమాలో హీరోయిన్ గా పెట్టాలి అంటే చూసుకునే ఏకైక క్వాలిటీ కంఫర్టబుల్ . నాగార్జున కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటిస్తాడు అన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు ఇద్దరూ ఫ్రీగా నటిస్తేనే ఆ సీన్ పండుతుంది . ఆ అమ్మాయి భయపడిన నాగార్జున భయపడిన తెరపై రొమాన్స్ పెద్దగా పండదు .
అందుకే నాగార్జున హీరోయిన్స్ ఎవరైతే ఫ్యామిలీ లుక్స్ తో బోల్డ్ గా నటించగలరు అన్న విషయాన్ని బాగా కనిపెట్టి.. చూసి.. ఆడిషన్ చేశాకే .. ఆమెను సినిమాల్లో తీసుకుంటారట . ఇప్పటివరకు మనం నాగార్జున చూస్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ చూస్తే అందరూ అలాంటి వాళ్ళే .. లుక్స్ పరంగా ట్రెడిషనల్ సీన్స్ పరంగా బోల్డ్ గా నటించే హీరోయిన్స్ ని ఎక్కువగా నాగార్జున చూస్ చేసుకుంటారట..!!