చాలామంది జనాలకు నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుంది . కొందరు టైడ్ అయిపోతే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయే టైంలో గురక పెడుతారు . మరికొందరికి పుట్టుకతోనే అలవాటు ఉంటుంది . మరికొందరికి పెరుగుతున్న స్ట్రెస్ కారణంగా అలాంటి అలవాట్లు వస్తూ ఉంటాయి . అయితే అలాంటి అలవాటు మన నాగార్జునకి కూడా ఉందట. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన అక్కినేని నాగార్జునకు ఎప్పుడు ఈ గురక పెట్టి అలవాటు వచ్చిందో తెలియదు .
కానీ ఆయనకు ఈ అలవాటు చాలా కాలం నుంచే ఉందట . అంతేకాదు ఆ గురకను పోగొట్టుకోవడానికి చాలా చాలా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారట . కానీ అది వర్క్ అవుట్ అవ్వడం లేదు . అంతేకాదు ఇప్పటికీ అమల ఆయన గురకను భరిస్తూనే ఉంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . మరి ముఖ్యంగా నాగార్జున డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాక పెట్టే గురక భయంకరంగా ఉంటుంది అని .. ఆ గురకను భరించడం చాలా కష్టమని ..అమలా కాబట్టి ఆయన కోసం ఆ గురకను భరించి నిద్రపోతుంది అని …
వేరే వాళ్ళైతే ఆ గురకను భరించి నిద్రపోవడం కష్టమని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు ప్రేమకు ఇదొక నిర్వచనం అంటూ కూడా అమల నాగార్జునల బంధాన్ని పొగిడేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే పది నిమిషాలు సౌండ్ వస్తే నిద్రపోవడమే కష్టం. మరి అన్ని సంవత్సరాల నుంచి అంత గురక పెడుతున్న భర్తను భరిస్తూ శాంతంగా ఉంది అంటే అమల ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!