Movies"సమంతకు ఆ ఫీలింగ్స్ ఎక్కువ"..విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకి ఆ విషయాని బయటపెట్టిన...

“సమంతకు ఆ ఫీలింగ్స్ ఎక్కువ”..విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకి ఆ విషయాని బయటపెట్టిన నాగచైతన్య..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు హీరో నాగచైతన్యకు ఉన్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . వీళ్ళిద్దరికీ సపరేట్ సపరేటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నా ఇద్దరు భార్యాభర్తలు గా ఉన్నప్పుడే ఎక్కువగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది . అయితే వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు . ఇప్పటికీ వీళ్లువిడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది .

అయితే ఇప్పటికైనా వీళ్ళు కలవకపోతారా..? అంటూ ఎదురుచూస్తున్నారు చై-సామ్ ఫ్యాన్స్ . కాగా వీళ్ళకి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నాగచైతన్య సమంత పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యారు . ఈ క్రమంలోనే మాజీ భార్య సమంత పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి..? అని హోస్ట్ ప్రశ్నించగా.. కృతి శెట్టి, పూజా హెగ్డే , సమంతల గురించి వివరిస్తాడు నాగచైతన్య “. ఈ క్రమంలోని సమంత గురించి మాట్లాడుతూ ..”సమంత ఏదైనా చేయాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా చేస్తుంది అని ..ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పని టోటల్గా కంప్లీట్ చేసేసే తీరుతుంది అని.. తనకు విల్ పవర్ ఎక్కువ అని హార్డ్ వర్క్ కూడా బాగా చేస్తుంది అని ..దానివల్లే సమంతని ఎక్కువమంది జనాలు ఇష్టపడతారు “అని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news