Newsసమంతకి క్రీమ్ బిస్కెట్స్ వేస్తున్న నాగచైతన్య .. ఫ్యాన్స్ ఫిదా..అక్కినేని హీరో...

సమంతకి క్రీమ్ బిస్కెట్స్ వేస్తున్న నాగచైతన్య .. ఫ్యాన్స్ ఫిదా..అక్కినేని హీరో అనిపించాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య తాజాగా నటించిన సినిమా వెబ్ సిరీస్ “ధూత”. ఈ వెబ్ సిరీస్ డిసెంబరు ఒకటిన స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమవుతుంది . ఈ క్రమంలోనే సిరీస్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు నాగచైతన్య. కాగా ఇలాంటి క్రమంలోనే సిరీస్ కు ఏమాత్రం హైప్ వచ్చే క్వశ్చన్స్ అస్సలు మిస్ చేసుకోవడం లేదు . రీసెంట్గా దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు ..

“మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి..?” అనే ప్రశ్న ఎదురైంది . ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత నటించిన “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ పేరును చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారి గా హోస్ట్ సైతం షాక్ అయిపోయారు. ఆ సీరిస్ లో నటించడం వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకునే స్థాయికి వెళ్లిపోయారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి .

అయితే నాగచైతన్య ఆమె నటించిన ఆ వెబ్ సిరీస్ ఫేవరెట్ అనడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . కొందరు కావాలని నాగచైతన్య తప్పించుకోవడానికి తన సినిమా ప్రమోషన్స్ కోసం సమంతని వాడుకుంటున్నారు అంటుంటే .. మరి కొందరు విడాకుల నింద తనపై పడకూడదు అని నాగచైతన్య ఇలా ఆన్సర్ ఇచ్చాడు అని అంటున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో నాగచైతన్య సమంత నటించిన విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news