శ్రీముఖి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి ఎలాంటి రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకు డబల్ రేంజ్ లో బుల్లితెరపై అభిమానులను ఆకట్టుకుంటుంది . అందం విషయంలో అయితే అస్సలు చెప్పనవసరం లేదు . శ్రీముఖి వెస్ట్రన్ వేర్ డ్రెస్ వేస్తే కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకునే శ్రీముఖి సోషల్ మీడియాలో లైవ్ సెషన్లో పాల్గొనింది .
ఈ క్రమంలోనే కొంతమంది ఆమె అభిమానులు రకరకాల ప్రశ్నలతో ఆమె ఓపికను టెస్ట్ చేశారు . “మీరు లవ్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ..?” అన్న ప్రశ్నకు శ్రీముఖి “చాలాసార్లు” అంటూ సమాధానమిచ్చింది . అంతేకాదు పెళ్లి తర్వాత యాంకరింగ్ మానేస్తారా..? అన్న ప్రశ్నకు “నో పెళ్లి తర్వాత కూడా యాంకరింగ్ చేస్తా” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నపై..” వెయిట్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను ” అంటూ చెప్పుకు వచ్చింది .
శ్రీముఖి మాటలు బట్టి గతంలో ఆమె ఎన్నోసార్లు ప్రేమ పేరుతో మోసపోయింది అనే విషయం క్లారిటీకి వచ్చేసింది. దీంతో గతంలో ఓ మేల్ యాంకర్ తో శ్రీముఖి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది అన్న వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు అతగాడితో పెళ్లి వరకు కూడా వెళ్లిపోయిందట . ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పకుండా అతనితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట . అప్పుడే అతగాడు నిజస్వరూపం తెలిసి అతడినిని దూరం పెట్టి శ్రీముఖి మంచి పని చేసింది అంటూ జనాలు చెప్పుకొచ్చారు. ప్రజెంట్ శ్రీముఖి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!