ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ – ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఆయన పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగ ఇలాంటి క్రమంలోనే మెగా వరుణ్ తేజ్ పెళ్లిలో ఆయన తండ్రి నాగబాబు చేసిన తప్పును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు .
సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కళ్యాణమండపం అంటే గుడిలా భావిస్తారు అందరూ ..అలానే అనుకుంటారు. నూతన వధూవరులను అక్కడ కూర్చోపెట్టినప్పుడు దేవుళ్లుగా భావిస్తూ ఉంటారు . అలాంటి మండపం పైకి చెప్పులు వేసుకుని వెళ్ళరు. అయితే నాగబాబు మాత్రం ఆ విషయాన్ని మరిచి చెప్పులు వేసుకున్నారు . మిగతా పెద్దపెద్ద హీరోలు కూడా చెప్పులు లేకుండా కళ్యాణ మండపాన్ని ఎంతో గౌరవంగా భావిస్తే ..
నాగబాబు మాత్రం ఇలా చెప్పులు వేసుకోవడం .. తన కొడుకు పెళ్లి ని అవమానించినట్టే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అస్సలు నాగ బాబు ఎందుకు ఇలా చేశాడు అని కొందరు అంటుంటే..? మరికొందరు మాత్రం ఏదో తెలియక పొరపాటున ఇలా చేసి ఉంటాడు లే అంటున్నారు జనాలు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పేగా..!!