ఒక సినిమా ఫ్లాప్ అయితేనే అవకాశాలు దక్కడం అరుదు. మళ్లీ నిర్మాతను, దర్శకుడినివెతుక్కునే పనిలో పడిపోతారు హీరోలు. మరి అలాంటిది..ఏకంగా 15 సినిమాలు.. అదికూడా వరుసగా ఫెయిల్ అయితే..కనీసం బాక్సాఫీస్‌దగ్గర కూడా.. పట్టుకోల్పోతే.. ఇంకేముంది.. ఇక, తూర్పు తిరిగి దణ్ణం పెట్టడమే. అలాంటి హీరోను ఎవరైనా నమ్మకంగా పెట్టుకుని సినిమాలు చేయగలరా? పైగా.. ఇప్పుడున్న రేంజ్‌లో వ్యాపారాలు అప్పుడు ఉండేవి కాదు. దీంతో హీరోలు చాలా ఆచితూచి అడుగులు వేసేవారు. స్క్రిప్టులోనూ జోక్యం చేసుకుని మార్పులు చేయించేవారు.
కానీ, హీరో కృష్ణ విషయానికి వస్తే.. చాలా డిఫరెంట్. ఆయన స్క్రిప్టులో జోక్యం చేసుకునేవారు కాదు. దర్శకుడికి అన్నీ తెలుసు.. అని వదిలేసేవారు. ఈ స్వేచ్ఛ.. కృష్ణను తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. అయితే.. ఆయన ఎదుర్కొన్న కష్టాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. వరుసగా 15 సినిమా ఫెయిల్ కావడంతో అబ్బాయి.. ఇక లాభం లేదు. ఇంటికెళ్లి ఏదైనా పనిచూసుకో అని సలహాలు ఇచ్చేవారు. ఇలాంటి సమయంలో ఏ హీరోఅయినా.. కుంగిపోతాడు. కానీ, కృష్ణ మాత్రం అలా కాదు.. పడ్డ చోట నుంచే లేచి నిలబడాలనే మనస్తత్వంతో ముందుకు సాగారు.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తరువాత విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాదాపు 15 సినిమాలు ఫట్ మనడంతో కృష్ణను నమ్మి .. హీరోగా సినిమాలు చేసేందుకు ఏ నిర్మాతా ముందుకు రాలేదు. పైగా ఈసడింపు మాటలు కూడా వచ్చాయి. మరి అప్పుడు ఏమి చెయ్యాలా అని అలోచించి.. తనే నిర్మాతగా మారారు కృష్ణ. ఇలా .. ఆయన తన సొంత బ్యానర్ పద్మాలయ మూవీస్‌ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌పై చేసిన తొలిసినిమా ‘పాడిపంటలుస. ఆ సినిమాపైనా పెద్దగా అంచనాలు లేవు. కానీ, కృష్ణ మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. చివరకు సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్. ఇంకేముంది.. ఇక, నిర్మాతలు క్యూ కట్టారు. మరి కృష్ణ ఊరుకుంటారా.. 15 సంవత్సరాల పాటు.. వేరే బ్యానర్‌లో చేయనని ఒట్టు పెట్టుకుని.. తన సొంత బ్యానర్‌పైనే సినిమాలు చేశారట. ఇదీ.. కథ!!