సినిమా రంగంలో ఉన్న వారు.. మొదట్లో ఆ ఫీల్డ్‌లోకి ప్రవేశించేందుకే నానా తిప్పలు పడుతుంటారు. ఇక, ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం.. మరో యజ్ఞం. ఇలా.. సినిమా రంగంలో తమకంటూ.. ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్న తర్వాత.. బాగా సంపాయించడం కామనే. అయితే.. ఇక్కడే ఇలా వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకోలేక.. వివిధ కారణాలతో పాడుచేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. చివరి దశలో అనేక ఇక్కట్లు కూడా అనుభవించిన వారు కూడా ఉన్నారు.
ఆస్తులు అమ్ముకున్న హీరోయిన్లు, హీరోలు కూడా ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఇలా.. అనేక మంది ఉన్నారు. ఇక, ఒకప్పటి అందాల తార.. కేఆర్ విజయ విషయానికి వస్తే.. ఆమెకు తన భర్త చెన్నైలో అతి పెద్ద బంగళా కట్టించారు. ఎంత పెద్దదంటే.. ఒకే సారి 50 కార్లు పార్కింగ్ చేసుకునేంత స్థలం, ఒకే దఫా 50 మంది కూర్చుని విందు ఆరగించేంత డైనింగ్ హాల్, 10 బెడ్ రూమ్స్.. నాలుగు స్విమ్మింగ్ పూల్స్.. ఇలా.. సర్వాంగ సుందరంగా ఉండే భవంతిని చెన్నైలో కట్టించారు.
కేఆర్ విజయది ప్రేమ వివాహం. ఓ విమాన ప్రయాణంలో విజయను చూసిన.. అప్పట్లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయన ఆమెను ప్రేమించారు. ఇలా.. ఇరు కుటుంబాల వారు ఒప్పుకోవడంతో పెళ్లి కూడా జరిగిపోయింది. విజయపై ప్రేమతో ఇమెకు అప్పట్లోనే కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతి పెద్ద భవంతిని నిర్మించారు. సుమారు 20 ఏళ్లపాటు అందులోనే ఇరువురు కాపురం చేశారు.
కుటుంబంలో ఎలాంటి కలతలు రాలేదు. కానీ, భర్త అనారోగ్యం పాలవడం.. విజయకు అవకాశాలు తగ్గడం.. పైగా ఒంటరిగానే ఉండాల్సి రావడంతో సదరు భవంతిని అమ్మేసి.. తనకు బెంగళూరులో చిన్న ఇల్లు కొనిపెట్టాలని కోరడంతో ఆమె భర్త.. సదరు భవంతిని అతి తక్కువ ధరలకే అమ్మేశారు. ప్రస్తుతం ఇందులో ఓ ప్రముఖ టీవీ చానల్ నడుస్తుండడం గమనార్హం.