టాలీవుడ్‌లో ఇటు నందమూరి ఫ్యామిలీకి అటు మెగా ఫ్యామిలీకి మధ్య నాలుగు దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ వేదికగా ఆసక్తికర వార్ నడుస్తూనే ఉంటుంది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ తమ సినిమాలతో ఎప్పటికప్పుడు పోటీ పడుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.
ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ముగ్గురు హీరోలు సినిమాలు చేస్తూ మెగా హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక 2023 వ సంవత్సరంలో నందమూరి, మెగా హీరోల మధ్య జరిగిన సమరంలో ఎవరిది పై చేయి అయింది..? ఎవరు తోపులు..? అన్నదానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వాల్తేరు వీరయ్య, సాయిధరమ్ తేజ్ విరూపాక్ష, పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కలిసిన నటించిన బ్రో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే చిరంజీవి వచ్చాక ఆయనకు అదిరిపోయే రిజల్ట్ ఇచ్చింది వాల్తేరు వీరయ్య మాత్రమే. విరూపాక్షతో సాయి ధరంతేజ్ తన కెరీర్ లోనే తెలుగులోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇక బ్రో సినిమా అంచనాలు అందుకోలేదు. కమర్షియల్ పరంగా చూస్తే బ్రో సినిమా ప్లాప్ అయినట్టే. ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాంఢీవ ధారి అర్జున సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయింది. ఇక చిరు భోళాశంకర్ అతి పెద్ద ఎపిక్ డిజాస్టర్.
ఇక డిసెంబర్‌లో వరుణ్ తేజ్ సినిమా ఆపరేషన్ వాలంటైన్, నవంబర్ చివరి వారంలో మరో మెగా హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల పరిస్థితి ఇలా ఉంటే.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ యేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు నటసింహం బాలయ్య. సంక్రాంతికి చిరంజీవి సినిమాతో పోటీపడి వీరసింహారెడ్డి గా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తే.. దసరాకు భగవంత్ కేసరిగా క్లీన్ హిట్ కొట్టారు.
అయితే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. ఇక ఈ ఏడాది మరో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏది రిలీజ్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే నందమూరి హీరోల సినిమాలు మూడే రిలీజ్ అయినా అందులో రెండు సూపర్ హిట్ లు ఉన్నాయి. అవి రెండు బాలయ్యవే. మెగా ఫ్యామిలీ నుంచి ఐదు సినిమాలు వస్తే రెండు హిట్ అవ్వగా 3 బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేసాయి.