మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ కెరీర్ ప్రస్తుతం ఏమీ బాగోలేదు. తెలుగులో ఇప్పటి వరకూ కొత్త సినిమాకి సైన్ చేయలేదు. ననై సరసన నటించిన దసరా సినిమానే ఆఖరు. మహానటి తర్వాత ఇప్పటి వరకూ కీర్తి ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టర్ చేరింది లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయినా అంతకముందే కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసింది.
కానీ, ఆ సినిమా మరుగున పడటంతో ఫస్ట్ మూవీ నేను శైలజ అని చెప్పుకుంది. ఈ సినిమా తర్వాత నేను లోకల్, అజ్ఞాత వాసి, మహానటి సినిమాలు కీర్తికి తెలుగులో పాపులారిటీని ఇంకా పెంచాయి. అయితే, మహానటి సినిమా తర్వాత కీర్తి కెరీర్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. తెలుగులో చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఒక మోస్తారుగా ఆడిన సినిమాలంటే నితిన్ సరసన నటించిన రంగ్ దే, నాని దసరా.
మలయాళం, తమిళంలో కూడా కీర్తి సురేశ్ సక్సెస్‌లను చూడలేకపోయింది. దీనంతటికీ ప్రధాన కారణం మహానటి సినిమా అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి పర్ఫార్మెన్స్ మహాద్భుతం. ఏకంగా జాతీయ అవరాడ్‌ను దక్కించుకుంది. కానీ, ఆ తర్వాత మాత్రం కీర్తి కథల ఎంపిక విషయంలో వరుసగా పొరపాట్లు చేస్తూ వచ్చింది. ఎంచుకున్న ప్రతీ సినిమా రాంగ్ స్టెప్.
దాంతో కీర్తి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌తో పోటీ పడలేకపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కిందని వార్తలు వస్తున్నాయి గానీ, అక్కడ కల్చర్ కి కీర్తి సూటవదు. గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి. ఈ మధ్య అలా కూడా ట్రై చేస్తుంది. కానీ, బాలీవుడ్ కి సరిపోయేంత కాదు. కాబట్టి, కీర్తి కెరీర్ ఎక్కడ చూసుకున్నా పెద్ద క్వశ్చన్ మార్క్‌లా కనిపిస్తుంది.