Moviesఅక్క ఎన్టీఆర్ తో.. చెల్లి ఆ హీరోతో.. ఏం ప్లానింగ్ రా...

అక్క ఎన్టీఆర్ తో.. చెల్లి ఆ హీరోతో.. ఏం ప్లానింగ్ రా బాబు..అమ్మనే మించిపోతున్నారుగా..!!

అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందానికి అందం నటనకి నటన అన్ని కలగలిపిన ఓ అందాల ముద్దుగుమ్మ . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి ఇండస్ట్రీని షేక్ చేసేసిన శ్రీదేవి .. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది . కాగా రీసెంట్గా శ్రీదేవి ఇద్దరు కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు .

జాన్వికపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మెప్పించగా కృషి కపూర్ కూడా “ది అర్బీస్” అనే హిందీ చిత్రంలో నటించి మెప్పించింది. తెలుగులో దేవర అనే సినిమాతో డేబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు . కాగా చెల్లి కుషి కపూర్ కూడా బడా హీరోతో నటించే ఛాన్స్ పట్టేసింది .

కోలీవుడ్ స్టార్ హీరో అధర్వకు జంటగా నటించడానికి ఖుషి కపూర్ సిద్ధమైనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దర్శకుడు ఆకాశ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర హైలెట్ కాబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. దీంతో అక్క చెల్లెలు ఇద్దరు బడా హీరోలతోనే హిట్ కొట్టేలా ఉన్నారే అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news