కోలీవుడ్లో ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తీక్. తన అన్న సీనియర్ హీరో సూర్య బాటలోనే నడుస్తూ తమిళంతో పాటు తెలుగులోను మంచి పేరు తెచ్చుకున్నాడు. కార్తీ హీరోగా నటించిన తాజా సినిమా జపాన్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన జపాన్ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది.
కార్తీక్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన జపాన్ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. ప్రీమియర్ షోల తర్వాత జపాన్ కు పాజిటివ్ లభిస్తుంది. సోషల్ మీడియాలోను ఈ సినిమా బాగుంది అన్న పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలో దొంగగా కార్తిక్ నటన గత సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా.. కొత్తగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కార్తీక్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని.. జపాన్ మూవీకి ఇది బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచిందని పేర్కొంటున్నారు. కార్తీక్ వన్ మ్యాన్ షో ఈ సినిమాకు హైలెట్గా నిలవనుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ జోడిస్తూ డిఫరెంట్ ఫాయింట్ తో దర్శకుడు రాజుమురుగన్ జపాన్ సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు. జపాన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ సర్ప్రైజింగ్ గా ఉంటాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ అఫ్ డ్రాబ్యాక్ అని మరో నెటిజన్ తన రివ్యులో పేర్కొన్నాడు. కథ లేకుండా టైంపాస్ చేయడంతో ఫస్ట్ అఫ్ కాస్త బోర్ కొడుతుందని.. అయితే సెకండ్ హాఫ్ ను మాత్రం దర్శకుడు థ్రిల్లింగ్గా నడిపించాడని ట్వీట్ చేశాడు.
ఇక జీవి ప్రకాష్ బిజిఎం ఈ సినిమాకు ప్రాణం పోస్తుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కథలోని ఫీల్‌ను తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎలివేట్ చేసిన తీరుకు నిజంగా హాట్సాఫ్ చెప్పాలని చెబుతున్నారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కు చాలా రోజుల తర్వాత మంచి హిట్ సినిమా లభించిందని.. ఆమె గ్లామర్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని చెబుతున్నారు. ఏది ఏమైనా కార్తీ జపాన్ కు అదిరిపోయే హిట్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి రివ్యూ తో జపాన్ భవితవ్యం ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.