Newsడైనో ' సలార్ ' ట్రైలర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది... కాల్పులు...

డైనో ‘ సలార్ ‘ ట్రైలర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది… కాల్పులు ఆగిపోయాయ్‌…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా సలార్. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డైనోసార్ గార్జిస్తుందని భారతీయ సినీ అభిమానులు అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గత ఏడాదికాలంగా సలార్ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి దిగుతుందా ? అని ఒక్కటే ఉత్కంఠతో ఉన్నారు. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న సలార్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్‌లో వీరంగం ఆడేసింది. సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? అన్న ఉత్కంఠ మొదలైంది. తాజాగా ఈ సినిమా తెలుగు థియేటర్ ట్రైలర్‌పై మేకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. ఈ భారీ డైనోసార్ సినిమాను ట్రైలర్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం కన్ఫామ్ అయిన దీనిపై అధికారిక‌ ప్రకటన రానుంది.

ఇక కాల్పులు ఆగిపోయాయ్ అని కూడా మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో స‌లార్ ప‌నులు అన్ని పూర్త‌య్యాయ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి నెక్ట్స్‌ బిగ్ డే డిసెంబర్ 1 అని చెప్పాలి. ఏదేమైనా సలార్ ట్రైలర్ కూడా బయటకు వస్తే సలార్ పై అంచనాలు ఎలా ఉంటాయో ? ఊహకే అందటం లేదు. మనం కచ్చితంగా మరో ఊహ ప్రపంచంలోకె వెళ్లిపోతామని ప్రభాస్ అభిమానులు ధీమాతో ఉన్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బసృర్‌ సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిలిమ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news