ప్రభాస్ కల్కి మూవీలో ముందు అనుకున్న హీరోయిన్ దీపిక కాదా..? అవును ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ వరల్డ్ స్థాయిలో అంటే గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినప్పటికీ ఆయనతో మేకర్స్ కనీసం 200 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తుండటం ఆసక్తికరం.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత అంతకంటే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడాని సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న కల్కీ ఏకంగా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోంది. ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరి లుక్స్ కూడా రిలీజయ్యాయి.
అయితే, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగ్ అశ్విన్ కల్కి సినిమాలో ముందు అనుకుంది ప్రియాంక చోప్రానట. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కే సినిమా కాబట్టి గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రా అయితే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కానీ, రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాక ప్రియాంక నో చెప్పిందట. దాంతో దీపికను నిర్మాతలు ఫిక్స్ చేసుకున్నారట. లేదంటే కల్కి సినిమాలో నటించాల్సింది ప్రియాంక చోప్రా.