Newsసిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ ఒక్కపని చేసి ఉంటే ఈరోజు బ్రతికే ఉండేవారు..!

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ ఒక్కపని చేసి ఉంటే ఈరోజు బ్రతికే ఉండేవారు..!

సిరివెన్నెల సినిమాతో సంగీత ప్రియులకే కాదు, ఇండస్ట్రీ వారికి, ప్రేక్షకులకీ బాగా దగ్గరైన వ్యక్తి సీతారామశాస్త్రి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకూ సందర్భం విని హీరో, హీరోయిన్స్ గురించి తెలుసుకుని పాట రాసిన రాస్తున్న సాహిత్య రచయితలున్నారు. కానీ సీతారామ శాస్త్రి మాత్రం అలాకాదు.

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఖచ్చితంగా దర్శకుడు కథ మొత్తం చెప్పాల్సిందే. ఎటువంటి సందర్భంల్లో పాట వస్తుంది..ఆ సమయంలో ఎలాంటి ఎమోషన్స్ ఉండాలి..అది పాటగా ఎలా ఎలివేట్ చేయాలీ…ఈ పాటలో ఎలాంటి పదాలు పడాలి..ఇదంతా ఓ కొలమానంగా చూస్తారు సీతారామ శాస్త్రి. ఎవరైనా వచ్చి సందర్భం చెప్పి ఇంత ఇస్తాము పాట రాయండీ అంటే అస్సలు ఒప్పుకోరు.

కొందరు రొమాంటిక్ సాంగ్ కావాలని తుచ్చమైన సందర్భం చెబితే సున్నితంగా ఇలాంటి పాటరాయాలంటే నా పెన్ను కదలయ్యా..అని చెప్పి వదిలేసుకుంటారు. అలా వదిలేసిన పాటలు ఎన్నో ఉన్నాయి. అంత నిజాయితీగా ఉంటారు సీతారామ శాస్త్రి. ఈ తరం రచయితలకి ఆయన గురించి తెలిసింది 10 శాతం కూడా ఉండదు. కొన్ని గంటలపాటు ఆయనతో గడిపిన కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మ, త్రివిక్రం లాంటి వారికే తెలుస్తుంది.

ఇన్నికట్టు బాట్లు పెట్టుకున్న సీతారామ శాస్త్రి సిగరెట్ విషయంలో మాత్రం ఎందుకనో ఎవరిమాట వినలేదు. అసలే రాత్రిళ్ళు పాట రాస్తుంటారు. ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ సిగరెట్స్ కాలుస్తూనే ఉంటారు. దానివల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అన్నీ నియమగా పాటించే ఆయన ఒక్క సిగరెట్ ని గనక తప్పించి ఉంటే ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాటలు వినిపిస్తూ ఉండేవి. జనాలని నిగ్గదిసి, సిగ్గుతీసి అడిగారు గానీ, సిగరెట్ ని మాత్రం అడగలేకపోయారు..నన్ను వదిలేయమని.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news