రాఘవేంద్రరావు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడుగా ఎన్నో హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ బొడ్డు పై ఫ్రూట్స్ వేసి పాపులారిటీ దక్కించుకోవడంలో రాఘవేంద్రరావు గారి తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
కాగా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా సరే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నటించడానికి ఇప్పటి కి హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . దానికి కారణం ఆయన హీరోయిన్స్ క్యారెక్టర్ డిజైన్ చేసే పద్ధతి . రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్రరావుకు హీరోయిన్స్ లో మీరు చూసే ప్రధాన క్వాలిటీ ఏంటి ..? అన్న ప్రశ్న ఎదురైంది .
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” వయసులో ఉన్న అమ్మాయిలు అందరూ అందంగా ఉంటారు . కొంతమంది అమ్మాయిలు కళ్ళు అందంగా ఉంటాయి ..మరి కొంతమందికి నడక.. మరి కొంతమందికి నవ్వు .. మరి కొంతమందికి నడుము .. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పార్ట్ బాగుంటుంది. చాలామందిలో మాట్లాడే పద్ధతి కూడా అందంగా ఉంటుంది . నా దగ్గరకు వచ్చిన వారిలో నేను ముందుగా ఎక్కువగా చూసేది హైట్ . నడుము, షేపు, బాడీ స్క్రచర్.. నేను ఆ అమ్మాయి సినిమాకి సెట్ అవుతుందా లేదా అని డిసైడ్ చేస్తాను “అంటూ రాఘవేంద్రరావు గారు చెప్పుకొచ్చారు . ప్రెసెంట్ ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!