News"త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ఝాన్సీ".. అన్ని విషయాలు ఓపెన్...

“త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ఝాన్సీ”.. అన్ని విషయాలు ఓపెన్ గానే చెప్పేసిందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . కెరియర్ స్టార్టింగ్ లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మోసపోయి విడాకులు తీసుకున్న ఎంతోమంది ఆ తర్వాత తమకంటూ ఒక తోడు ఉండడం కోసం తమ లైఫ్ లో రెండో వ్యక్తికి స్థానం కల్పిస్తున్నారు. రీసెంట్ గానే చాలామంది స్టార్ ప్రముఖులు అలా రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే .

కాగా ఇప్పుడు అలాంటి సిచువేషన్ ఫేస్ చేయబోతుంది యాంకర్ ఝాన్సీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఝాన్సీ 1997 నుంచి 2007 వరకు దాదాపుగా పది సంవత్సరాలు టీవీ షో లతో దూసుకుపోయింది . అప్పట్లో ఝాన్సీ హోస్ట్ చేస్తుంది అంటే ఆ షో హిట్ అవ్వాల్సిందే . అంతలా క్రేజ్ సంపాదించుకుంది .

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెట్టింది . “నా గతంలో ఆనందం కంటే బాధలే ఎక్కువగా ఉన్నాయి. విడాకులు తీసుకున్న తర్వాత నా కెరియర్ ఎలా మలుపు తిరిగిందో నాకే తెలియదు .. కూతురిని ప్రాణంగా చూసుకుంటూ లైఫ్ని బాలన్స్ చేసుకోవడమే నా లక్ష్యంగా మారిపోయింది . నన్ను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోమని చాలా మంది ఫోర్స్ చేశారు . కానీ నా మొదటి భర్త వల్ల పడ్డ కష్టాలు నాకు రెండో పెళ్లి పై ఇంట్రెస్ట్ తీసుకురాలేకపోయాయి .. నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే నన్ను నచ్చే వ్యక్తికి సర్దుకుపోయే తత్వం ఉండాలి అని డిసైడ్ అయ్యాను . అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం “అంటూ యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది . దీంతో ఝాన్సీ మాటలు బట్టి అలాంటి వ్యక్తి దొరికితే ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి కొందరు ఆమె కి మైండ్ లో ఎవ్వరైన ఉండి ఉంటారని.. అందుకే ఇలా మాట్లాడింది అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news