బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్‌మన్ కలర్ సినిమాల వరకు కలిసినటించిన జంటల్లో అంజలీదేవి-అక్కినేని నాగేశ్వరావులది హిట్ కాంబినేషన్. వీరు నటించిన దాదాపు అన్ని సినిమాలు 100 రోజుల వేడుక చేసుకున్నాయి. దీంతో వీరి కాంబినేషన్‌కు ఎనలేని డిమాండ్ ఉండేది. దీంతో ఈ జంటపై అనేక కథనాలు.. కల్పితాలు వచ్చేవి. ఔట్ డోర్ షూటింగుల్లో రాసుకుపూసుకు తిరిగేవారనికూడా ప్రచారం జరిగింది.
ఇవన్నీ.. అప్పట్లో సినిమా ఫీల్డ్‌ను కుదిపేసేవి. ఇప్పట్లాగా.. లైట్తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. దీంతో ఈ విషయం.. అంజలీదేవి భర్త ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు దృష్టికి వచ్చింది. అంజలి.. అక్కినేని మధ్య ఏమీలేదని.. ఇదంతా ట్రాష్ అని ఆయన అనేవారు. కానీ, మీడియాలో మాత్రం రోజుకో కథనం.. ఫొటోలు హల్చల్ చేసేవి. వీటిని చూసిన తర్వాతైనా.. ఆదినారాయణరావు స్పందిస్తారనేది అప్పటి మీడియా ఉద్దేశం కావచ్చు.
అయినప్పటికీ.. ఆదినారాయణ రావు మాత్రం ఎక్కడా ఫైర్ అయ్యేవారు కాదు. షూటింగులకు వెంటే ఉండేవారు. అయితే.. కొన్ని కొన్ని సార్లు మాత్రం ఆయన బిజీగా ఉండడంతో ఔట్ డోర్ లకు దూరంగా ఉండేవారు. అప్పుడు కూడా.. ఏమీ అనేవారు కాదట. అంతేకాదు.. కీలు గుర్రం వంటి సినిమాలు చూపించి.. అక్కినేనికి అమ్మ వరస అవుతుంది! అని చెప్పేవారట. ఇది కూడా నిజమే. కొన్ని కొన్ని ఓల్డ్ మూవీల్లో అంజలీదేవి అక్కినేనికి అమ్మగా నటించారు. తర్వాత.. వదిన పాత్రల్లోనూ నటించారు. వీటినే చూపిస్తూ.. ఆదినారాయణ రావు.. ఇలాంటిగ్యాసిప్స్కు అడ్డుకట్ట వేసేవారట.