News' గుంటూరు కారం ' రిలీజ్ డేట్‌.. కొత్త పుకారు...!

‘ గుంటూరు కారం ‘ రిలీజ్ డేట్‌.. కొత్త పుకారు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా మాటాల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ భారీ మాస్ మసాలా ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా నుంచి ఈరోజు వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రోమోకి సూప‌ర్‌ మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫుల్ సాంగ్ కోసం అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మహేష్ థియేటర్లలోకి వస్తున్నాడు.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో గుంటూరు కారంకు గట్టి పోటీ తప్పలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా మేకర్స్‌ రిలీజ్ డేట్ జనవరి 11 కి మార్చుకోవాలని ఒత్తిడి ఉందని గత నాలుగు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఫిక్స్ అయిన జనవరి 12న గుంటూరు కారం సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఈరోజు ప్రముఖ కన్ఫర్మ్ చేశారు. దీంతో గుంటూరు కారం ఒకరోజు ముందుగా రిలీజ్ అవుతుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news