టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.
13 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా తెరకెక్కుతోంది. దీంతో గుంటూరు కారం సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా థియేటర్ బిజినెస్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇటు మహేష్ బాబు వరుసహిట్లతో ఉన్నాడు. అటు త్రివిక్రమ్ బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో గుంటూరు కారం అదిరిపోయే రేంజ్‌లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఏపీ తెలంగాణలోనే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.120 కోట్ల రేంజ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. రూ.121 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా ఏపీ, తెలంగాణలో క్లీన్ హిట్ సినిమాగా నిలుస్తుంది. అంటే దాదాపు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ మొత్తం రావటం పెద్ద కష్టం కాదు. అయితే సంక్రాంతికి రవితేజ, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు హనుమాన్ సినిమా కూడా రేసులో ఉంది.
ఆ సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తే గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కాలంటే మహేష్ బాబు గట్టి సౌండ్ చేయాలి. మరి మహేష్ సత్తా స్టామినా ఏ రేంజ్ లో ? ఉంటాయో గుంటూరు కారం చెప్పేయనుంది. మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.