News"వెళ్లి ఆ ప్రశ్న అల్లు అర్జున్‌ను అడగండి".. రిపోర్టర్ కి ఇచ్చిపడేసినా...

“వెళ్లి ఆ ప్రశ్న అల్లు అర్జున్‌ను అడగండి”.. రిపోర్టర్ కి ఇచ్చిపడేసినా హన్సిక..!

హన్సిక .. ఈ పేరుకు కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ముందుకు వెళ్తుంది . హన్సిక అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో తెలుగులో పెద్ద హీరోయిన్గా మారిపోతుంది అని అంతా అనుకున్నాం. ఈ సినిమా తప్పిస్తే తెలుగులో పెద్దగా హిట్ కొట్టింది లేదు . అయితే కోలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అక్కడ పలు సినిమాలు చేస్తూ ఇంకా బిజీబిజీగానే ఉంది .

రీసెంట్ గా హన్సిక మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది . ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హన్సిక చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు . ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ..” మేడం మీరు దేశముదురు తర్వాత అసలు అల్లు అర్జున్ గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు.. పోనీ భవిష్యత్తులో ఏమన్నా ఒకే స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఉందా ..?” అంటూ అడిగారు .

ఇక దీనికి సమాధానం ఇస్తూ హన్సిక కూసింత ఘాటుగా గట్టిగానే ..”మీరు ఇదే ప్రశ్న అల్లు అర్జున్ కనిపించినప్పుడు అడగండి సమాధానం దొరుకుతుంది” అంటూ రిప్లై ఇచ్చింది . దీంతో హన్సిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హన్సిక అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఎందుకో వీళ్ళ కాంబోలో మరో సినిమా రాలేకపోయింది . చూద్దాం రిపోర్టర్ అడిగిన ప్రశ్న నిజం అవుతుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news