సాయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు, దర్శక రచయిత మహేశ్ మంజ్రేకర్ కూతురు సాయీ మంజ్రేకర్. నట వారసులు గానీ, వారసురాళ్ళు గానీ మొదటి సినిమా వరకే బ్యాక్‌గ్రౌండ్ పనికొస్తుంది. ఆ తర్వాత నుంచి ఎవరి తెడ్డు వాళ్ళు వేసుకోవాల్సిందే. ఆ తెడ్డు గనక సరిగ్గా వేసుకోకపోతే వెనక తండ్రి పెద్ద దర్శకుడైన, హీరో అయినా నిర్మాత అయినా పట్టించుకునేవాళ్ళుండరు.
బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయీ మంజ్రేకర్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇంతే అని మాట్లాడుకుంటున్నారు. హిందీ బెల్ట్‌లో ఎంట్రీ ఈజీగానే జరిగింది. అది కూడా ఏకంగా బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సిరీస్‌లో. సాయీ పర్ఫార్మెన్స్ సో సోగా ఉన్నా సల్మాన్ ఖాన్ పేరు మీద సినిమా హిట్ అయింది. అంతేగానీ, నిజంగా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మర్ అని మాత్రం చెప్పుకోలేరు.
అయినా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకేసారి రెండు సినిమాలలో ఛాన్స్ అందుకుంది. మహేశ్ బాబు భార్య నమ్రత సాయీ మంజ్రేకర్ కి అత్యంత సన్నిహితురాలు. కాబట్టి మహేశ్ నిర్మాణంలో వచ్చిన మేజర్ సినిమాలో, వరుణ్ తేజ్ నటించిన ఘని సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే, వీటిలో మేజర్ ఓ మాదిరిగా ఆడింది. ఘనీ అడ్రస్ లేకుండా పోయింది.
ఈ రెండు సినిమాలలో సాయీ మంజ్రేకర్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. శ్రీలీల మాదిరిగా హీటెక్కించే డాన్సులు కైపెక్కించే రొమాంటిక్స్ సీన్స్ చేసిందీ లేదు. దాంతో మనకి సాయీ మంజ్రేజర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టాలీవుడ్ మేకర్స్ దూరం పెట్టారు. అయినా బోయపాటి శ్రీను ఏదో చూపిద్దామని శ్రీలీల ఉన్నా కూడా సాయీ మంజ్రేకర్ కి స్కంద సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. సినిమా ప్లాప్ అవ్వడంతో శ్రీలీల గురించే ఎవరూ మాట్లాడుకోలేదు. ఇక సాయీ సంగతి సరేసరి.