Moviesలావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో కట్టుకున్న ఈ చీర ఎన్ని లక్షలో...

లావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో కట్టుకున్న ఈ చీర ఎన్ని లక్షలో తెలుసా.. మెగా కోడలు రేంజ్ అంటే అంతేమరి..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒకప్పుడు లావణ్య త్రిపాఠి గురించి జనాలు పట్టించుకునే వాళ్ళు కాదు . కానీ ఇప్పుడు మాత్రం ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటే గాని లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కాలేదు అని .. ఆమె చాలా చాలా గ్రేట్ అని పొగిడేస్తున్నారు .

వీళ్ళ రిసెప్షన్ నిన్న హైదరా బాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు . ఈ రిసెప్షన్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర చాలా స్టైలిష్ గా కనిపించింది . అంతేకాదు ఈ చీర ఎక్కడో చూసినట్టుందే అంటూ కూడా జనాలు గుర్తు పడుతున్నారు . ఈశారీను ఆల్రెడీ ఓ ఈవెంట్లో సుహానా కట్టుకునింది .

షారుఖ్ ఖాన్ కుమార్తె సుహాన ఖాన్ ఈ చీరను ఆల్రెడీ ట్రై చేసేసింది. ఈ చీరలో ఆమె ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది . ఈ చీరను మనీష్ మిల్హోత్రా డిజైన్ చేశారు. లావణ్య త్రిపాఠి ఈ చీరను సుహాన కట్టుకొని ఉంటే చూసి మెచ్చి అలాంటి చీర కావాలని డిజైన్ చేయించుకుందట . ఈ చీర ఖరీదు దాదాపు మూడు లక్షల 75000 అంటూ తెలుస్తుంది. దీంతో మెగా కోడలు రేంజ్ పూర్తిగా మారిపోయింది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news