Moviesపవిత్ర లోకేష్ రోజు కాల్ షీట్ రేట్ ఎంతో తెలుసా.. వామ్మో..!

పవిత్ర లోకేష్ రోజు కాల్ షీట్ రేట్ ఎంతో తెలుసా.. వామ్మో..!

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా తర్వాత అంత పాపులర్ అయిన విషయం ఏదంటే సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర లోకేష్ డేటింగ్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ పెళ్లికి నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి అడ్డంకులు సృష్టిస్తున్నట్టు కథనాలు విపరీతంగా వచ్చాయి. ఈ జంటకు టాలీవుడ్ లో స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మించిన పాపులారిటీ వచ్చింది. ఈ గొడవలు ఇలా జరుగుతూ ఉండగానే ఇటీవలే నరేష్ పక్కన మళ్ళీ పెళ్లి సినిమాలో పవిత్ర లోకేష్ నటించింది.

ఈ సినిమాలో నటించినందుకు కూడా నరేష్.. పవిత్రకు ఏకంగా కోటికి పైగా రెమ్యూనరేషన్ ముట్ట చెప్పాడట. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. ఇక పవిత్రకు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ పెరిగింది. ఎప్పుడు అయితే నరేష్‌తో కలిసి ఉంటుందో.. అప్పటినుంచి టాలీవుడ్ లోనూ సోషల్ మీడియాలోను పవిత్ర పిచ్చపిచ్చగా పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఆమె తమ సినిమాల్లో ఉంటే తమ సినిమాలకు కూడా మంచి క్రేజ్‌ వస్తుందని మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.

అందుకే పవిత్రకు టాలీవుడ్ లో ఆఫర్లు కూడా ఎక్కువయ్యాయి. పవిత్ర ఒక్క రోజు కాల్ షీటుకు రూ.50 వేలు ఛార్జ్ చేస్తోందట. నరేష్‌తో అనుబంధం బలపడ్డాక ఆమె క్రేజ్ పెరగడంతో ఇప్పుడు దానిని డబుల్ చేసి ఒకరోజు కాల్‌షీట్‌కు లక్ష రూపాయలు తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో తల్లిగా, సోదరిగా, ఆంటీగా పలు ఆఫర్లు ఆమెను పలకరిస్తూనే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news